Thursday, May 2, 2024
- Advertisement -

వెంక‌య్య ఇక చాలు..

- Advertisement -
BJP avoied central minister venkiah naiudu

అవ‌స‌రాలు ,అధికారంకోసం రాజ‌కీయాలు మారిపోవ‌డం స‌హ‌జం.దీనికి ఏపార్టీ అతీతంకాదు. అవ‌స‌రం ఉన్న‌ప్పుడు మ‌నుసుల‌ను వాడుకోవ‌డం అవ‌స‌రం తీరాక వారిని ప‌క్క‌న పెట్ట‌డం రాజ‌కీయాల్లో స‌హ‌జం. ఒక‌ప్పుడు అన్నీ తానై పార్టీకోసం ప‌నిచేసినా…వారి అవ‌స‌రం తారాక వాల్లు క‌నిపించ‌కుండా పోతారు. అలాంటి ప‌రిస్థితే ఇప్పుడు భాజాపా సీనియ‌ర్‌నేత‌కు వ‌చ్చింది.

తెలుగు రాష్ట్రాల‌కు పెద్ద‌దిక్కుగా కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు ఉన్న సంగ‌తి తెలిసిందే.రెండు రాష్ట్రాల్లో భాజాపా ఏకార్య‌క్ర‌మం న‌ర్వ‌హించినా అన్నీ తానై ముందుండి న‌డిపించే వెంక‌య్య‌కు ఇప్పుడు ప‌రిస్థితులు ఎదురు తిరుగుతున్నాయి.భాజాపా అధిస్టానం ఇప్పుడు వెంకయ్య‌నాయుడిని ప‌క్క‌న పెట్టిన‌ట్లు వార్త‌లు గుప్పుమంటున్నాయి.దీనికి నిద‌ర్శ‌నంగా క‌మ‌ళ‌ద‌లం భాస్ అమీత్‌షా రెండు తెలుగు రాష్ట్రాల‌లో ప‌ర్య‌ట‌న‌లో వెంక‌య్య మార్క్ క‌నిపించ‌డంలేదు.

{loadmodule mod_custom,Side Ad 1}

ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా మోదీ-అమీత్‌షా ద్వ‌యం గాలి వీస్తోంది.ఈరెండు రాష్ట్రాల్లో సొంతంగా ఎద‌గాల‌ని భాజాపా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది.అందుకే తెంగాణా,ఏపీల‌లో రాజ‌కీయ బేరీజు వేస్తున్నారు.తెలంగాణాలో రెడ్ల‌ని-ఏపీలో జ‌గ‌న్‌ను క‌లుపుకుపోవాల‌ని అమీత్‌షా వ్యూహాలు ర‌చిస్తున్నారు.దీనిలో భాగంగానే వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌ధాని మోదీ స‌మావేశం సంకేతాల‌ను పంపింది.టీడీపీతో పొత్తు కొన‌సాగినంత కాలం భాజాపా ఆశ‌యం నెర‌వేర‌దు.
ఒక‌వేల సౌత్‌లో భాజాపా పాగా వేస్తే అక్రిడిట్ అంతా వెంక‌య్య‌కు పోతుంద‌ని అందుకే ఆయ‌న్ను ఎలాగైనా ప‌క్క‌న పెట్టాల‌ని అమీత్‌షా తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.అదునుకోసం వేచి చూస్తున్న అమీత్‌షాకు ఇప్పుడు ఆయుధం దొరికింది.నేను బ‌తికున్నంత వ‌ర‌కు భాజాపా-వైసీపీ క‌ల‌వ‌డం జ‌ర‌గ‌ద‌ని సెల‌విచ్చారు వెంక‌య్య‌.దీన్ని షాకుగా తీసుకొని ఆయ‌న్ని పూర్తిగా ప‌క్క‌కు ఎట్టి ప్ర‌త్య‌క్షంగా కార్య‌క‌ర్త‌ల‌తో సమ‌న్వ‌యం చేసుకుంటూ రంగంలోకి దిగారు.టీడీపీతో పొత్తు భాజాపాలోని వారికి ఇస్టంలేద‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం.

{loadmodule mod_custom,Side Ad 2}

అప‌ర రాజ‌కీయ వేత్త‌గా పేరు సంపాదించి వెంక‌య్య‌నాయుడికి ఇప్ప‌టికే ఈ విష‌యం బోధ‌ప‌డిన‌ట్లుంది.అందుకే ఏమిమాట్లాడ‌కుండా సైలెంట్‌గా ఉండిపోయారు.దీంతో తెలుగు త‌మ్ముళ్లు ఆలోచ‌న‌లో ప‌డితే…వైసీపీ మాత్రం సంతోషంగా ఉంది.

Also read

  1. సొంత‌పార్టీ కార్య‌క‌ర్త‌ల‌చేతిలో అవ‌మాన‌పాల‌యిన లోకేష్‌
  2. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు ఉండ‌ద‌ని ప‌రోక్షంగా చెప్పిన భాజాపా ఛీప్‌ అమీత్‌ షా
  3. చంద్ర‌బాబు ప‌రువు తీస్తున్న తెలుగు త‌మ్ముళ్లు…
  4. బాబునే టార్గెట్ చేసి భాజాపా మ‌హిళా సీనియ‌ర్‌నేత‌..మాజీ మంత్రి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -