- Advertisement -

కేంద్రం చెప్పిన లెక్క: ఏపీకి, పోలవరానికి ఇంత.?

- Advertisement -

కేంద్రంలోని బీజేపీ ఏపీకి అన్యాయం చేస్తోందని అధికారంలో ఉండగా చంద్రబాబు ఆరోపించారు. ఇక ఏపీకి రావాల్సిన నిధుల కోసం సీఎం జగన్, వైసీపీ ఎంపీలు కేంద్రాన్ని కోరుతూనే ఉన్నారు. రాజధాని కూడా లేని ఏపీకి నిధులు ఇవ్వాలని.. ఏపీ కలల ప్రాజెక్టు పోలవరానికి నిధులు సమకూర్చాలని కోరుతూనే ఉన్నారు.

అయితే కేంద్రం మాత్రం పెద్దగా స్పందించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా కేంద్రం అధికారికంగా పార్లమెంట్ లో స్పందించింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలు, రెవెన్యూ లోటు భర్తీ, మిగిలిన నిధులతో కేంద్రం ఎంత ఇచ్చిందో రాజ్యసభలో లెక్కలతో సహా వివరించింది.

ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటివరకూ కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇచ్చిన మొత్తం అక్షరాల రూ.33,923.01 కోట్లు ఇచ్చినట్టు తెలిపింది.. మెజార్టీ నిధులు చంద్రబాబు సర్కారు హయాంలోనే వచ్చాయి. మరి ఆయన ఏం చేశారన్నది మాత్రం అంతుబట్టడం లేదని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

తాజాగా కేంద్రహోంశాఖ సహాయమంత్రి రాజ్యసభలో ఈ మేరకు ఏపీకి 33 వేల కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. ఏపీలోని 7 వెనుకబడిన జిల్లాలకు రూ.2100 కోట్ల ఆర్థిక సాయం అందించాలని నీతి అయోగ్ సిఫార్సు చేసిందన్నారు. ఇక ఏపీ కలల ప్రాజెక్టు పోలవారానికి ఏపీ ప్రభుత్వం రూ.5103 కోట్లు రుణం తీసుకొని ఖర్చు చేసిందని.. దానిని వెంటనే కేంద్రం ఇవ్వాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు. ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వెంటనే విడుదల చేయాలని కోరారు.రెవెన్యూ లోటు కింద 18969 కోట్లను సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలని విన్నవించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -