- Advertisement -

చంద్రబాబు సెల్ఫ్ డబ్బా కోసం ఏపీ దారుణంగా నష్టపోయింది

- Advertisement -
Chandrababu Naidu On Notes Ban

ఏ విషయం గురించి ఎప్పుడు మాట్లాడాలి, ఎంతవరకూ మాట్లాడాలి , రాష్ట్ర ప్రయోజనాల విషయం లో ఎలా వ్యవహరించాలి అనేది చంద్రబాబు కి తెలీని విషయం కాదు గానీ కెసిఆర్ నుంచి మాత్రం ఈయన ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన కొన్ని వ్యవహారాలు ఖచ్చితంగా ఉన్నాయి. పదిహేను రోజుల క్రితం మోడీ నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన రెండవ రోజునే కెసిఆర్ తన అసంతృప్తి వ్యక్తం చేసారు. సంపన్న రాష్ట్రం అయిన తెలంగాణ మోడీ నిర్ణయం తో వెనక్కి వెళ్ళిపోతుంది అని బాధ పడ్డారు.

అంతేకాదు.. రెండు రోజులకోసారి.. మోడీ తీసుకున్న నిర్ణయంతో తమ ఆదాయానికి ఎంత ఎఫెక్ట్ అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ ప్రజలకు అప్ డేట్ చేసే ప్రయత్నం చేశారు. ధనిక రాష్ట్రం అని ఇన్నాళ్ళూ చెప్పుకునే తెలంగాణా కి చాలా పెద్ద కష్టం వచ్చింది అని ఆయన అభిప్రాయ పడ్డారు. అయితే అప్పుల్లో ఉన్న ఏపీ కి ఈ నిర్ణయం మరింత ఇబ్బంది సృష్టిస్తుంది అనేది మాత్రం తెలిసినా కూడా బాబుగారు  మాట్లాడకపోవడం విశేషం. ఏపీ ముఖ్యమంత్రి నోటి నుంచి మాత్రం కష్టాల మాట రాలేదు.

పెద్ద నోట్ల రద్దు అంశాన్ని తాను ఎప్పటి నుంచో చెప్పానని.. ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని.. మోడీ నిర్ణయం వెనుక తన మాటలు ఉన్నట్లుగా ఆయన ప్రచారం చేసుకోవటం పైనే ఫోకస్ చేశారు. తన వ్యక్తిగత ఇమేజ్ మీద చూపించిన ఆసక్తి.. ఏపీ రాష్ట్ర ప్రయోజనాల మీద చంద్రబాబు చూపించి ఉంటే బాగుండేది. అలాంటివి ఏమీ జరగలేదు మరొక పక్క కెసిఆర్ మాత్రం తమ రాష్ట్రానికి పెద్ద కష్టమే వచ్చింది అనీ కేంద్రం ఆదుకోవాలి అని ఓపెన్ గా చెప్పేశారు. నిజానికి ఇలాంటివి కేసీఆర్  కంటే చంద్రబాబు ముందు చేయాల్సి ఉంది. కానీ.. రద్దు నిర్ణయంపై ప్రజల్లో పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారన్న అంచనాతో.. ఆ మైలేజీలో ఎంతోకొంత భాగాన్ని తానుచేజిక్కించుకోవాలన్న  భావనలో చంద్రబాబు ఉన్నారని చెప్పక తప్పదు. సో ఇది ఏపీ రాష్ట్రానికి పెద్ద దెబ్బే వేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -