Monday, May 13, 2024
- Advertisement -

మంత్రి వర్గ మార్పు అదరహో

- Advertisement -

అసెంబ్లీ సమావేశాల తర్వాత – దసరా పండుగకు ముందే మంత్రివర్గంలో మార్పులు – చేర్పులు చేయాలానుకుంటున్నట్లు స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో చెప్పిన నేపథ్యంలో ఏపీ రాజకీయాల చర్చ అంతా ఇపుడు కేబినెట్ బెర్తులపై పడింది. ఈ క్రమంలోనే మంత్రివర్గంలో ఉండేదెవరు..కొత్తగా చోటు దక్కించుకునేదేవరు అంటూ పార్టీ వర్గాలో జోరుగా చర్చించుకుంటున్నాయి.

అయితే ఏపీ మంత్రివర్గ విస్తరణతో కూడా ప్రతిపక్ష వైసీపీని మరింత బలహీనం చేసే ఎత్తడకు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబబు శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఏర్పడి రెండున్నరేళ్లు అయిపోతోంది.  పనితీరు బాగాలేక – వైసీపీ నుండి వచ్చిన వారికిచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు – సమర్ధులను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే కారణాలతో మంత్రివర్గాన్ని చంద్రబాబు  ప్రక్షాళన చేయబోతున్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది.

ఇపుడు మంత్రివర్గ విస్తరణ లేదా మార్పులు – చేర్పులు చేపడితే మళ్ళీ మంత్రివర్గంలో మార్పులుండటం దాదాపు అనుమానాస్పదమే. అంటే త్వరలో చేయబోయే మంత్రివర్గం ప్రక్షాళనతోనే వచ్చే ఎన్నికల వరకూ సీఎం చంద్రబాబు నెట్టుకుని వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వివిధ సమీకరణల రూపంలో బాబు పదవులు భర్తీ చేస్తారని అంటున్నారు. వైసీపీ నుండి వచ్చిన 20 మంది ఎమ్మెల్యేల్లో  భూమా నాగిరెడ్డి – సుజయ కృష్ణ రంగారావు – జ్యోతుల నెహ్రూ – జలీల్ ఖాన్ లకు మంత్రివర్గంలో చోటుంటుందని అంటున్నారు. ప్రస్తుత మంత్రుల్లో కిమిడి మృణీళిని – పీతల సుజాత – పల్లె రఘునాధరెడ్డి – రావెల కిషోర్ బాబు లకు ఉద్వాసన తప్పదని కూడా ప్రచారం సాగుతోంది. ఇదిలాఉండగా మార్పుచేర్పులకు వైసీపీకి లింక్ ఉండనుందని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -