Monday, May 13, 2024
- Advertisement -

బీజేపీతో స్నేహం కోసం.. ఏపీ ప్రజలకు శత్రువవుతున్న బాబు?

- Advertisement -

మొన్నటి వరకూ కేంద్ర ప్రభుత్వం రెక్కలు విరిచి ఎగరమంటోంది..అని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే తప్ప సమస్యలు పరిష్కారం కావు అని ఆయన స్పష్టం చేస్తూ వచ్చారు. కేంద్ర సహకారం అందించాల్సిదేనని ఆయన స్పష్టం చేశారు.

అయితే బాబు ఇప్పుడు మాట మార్చారు…! ప్రత్యేక హోదాతో పనేం లేదని ఆయన అంటున్నారు. ప్రత్యేక హోదాతోనే అన్ని సమస్యలూ పరిష్కారం అయిపోవని ఆయన వ్యాఖ్యానించారు.. ఒక వ్యూహం ప్రకారమే బాబు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని కూడా అభిప్రాయాలు వినిపిస్తున్నాయిప్పుడు.

ఎలాగూ ప్రత్యేక హోదా ఏపికి అందని ద్రాక్షే.. అనే విషయాన్ని గ్రహించి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడుతున్నాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో.. ప్రత్యేక హోదాను సాధించుకురావడంతో తాము ఫెయిలయ్యామనే విషయాన్ని కవర్ చేసుకోవడానికే ఆయన ప్రత్యేక హోదాతో ఒరిగేం లేదనే మాట చెబుతున్నాడని విశ్లేషకులు అంటున్నారు. ఎలాగూ ఉపయోగం లేదు కాబట్టి.. అది వచ్చినా రాకపోయినా తేడా లేదు అని చెప్పడం బాబు ఉద్దేశం!

అయితే మొదట్లో బాబు వేరే రకంగా మాట్లాడాడు. ప్రత్యేక హోదా కావాల్సిందేనని అన్నారు. అయితే కేంద్రం నుంచి ఈ విషయంలో సానుకూల ధోరణి కనపడటం లేదు. అందుకే బాబు కూడా గొంతు సవరించుకొంటున్నారు. ఎలాగూ కేంద్ర ప్రభుత్వం ఏపీ కి ప్రత్యేక హోదా ఇచ్చేలా లేదు కాబట్టి.. ఈ విషయంలో మాట్లాడి వాళ్లతో శత్రుత్వాన్ని పెంచుకొనే బదులు సైలెంటయిపోవడమే మేలని బాబు  భావిస్తున్నట్టుగా ఉన్నారు, మరి లా వ్యవహరించడం వల్ల బీజేపీకి మిత్రపక్షంగా నిలబడవచ్చునేమో కానీ.. ప్రజలకు శత్రువులతామనే విషయాన్ని బాబు మరిచిపోతునట్టున్నారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -