Monday, May 6, 2024
- Advertisement -

చంద్రయాన్ 2 ఆచూకీ తెలిసింది: ఇస్రో

- Advertisement -

చంద్రయాన్ ప్రయోగం చివరి దశలో సిగ్నల్స్ కట్ అయిపోయి నిరాశలో కూరుకుపోయిన ఇస్రోకు ఊరట లభించింది. చంద్రయాన్2 ప్రయోగంలో పురోగతి లభించింది. తాజాగా విక్రమ్ ల్యాండర్ ఆచూకీని గుర్తించినట్టు ఇస్రో ప్రకటించింది. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ శివన్ స్వయంగా వెల్లడించారు.

చంద్రుడి చుట్టు తిరుగుతున్న ఆర్బిటర్ చంద్రుడి ఉపరితలంపై ఉన్న ల్యాండర్ థర్మల్ చిత్రాలను తీసిందని వివరించారు. ల్యాండర్ తో సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. త్వరలోనే ల్యాండర్ తో సంబంధాలు ఏర్పడే అవకాశం ఉందని శివన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

చంద్రయాన్ 2 సాఫ్ట్ ల్యాండింగ్ విషయంలో ఆఖరిలో 2.1 కి.మీల ఎత్తులో ఉండగా సాంకేతిక సమస్యలు ఏర్పడిన సంగతి తెలిసిందే.. దీంతో సిగ్నల్స్ కట్ అయిపోయాయి. మరి విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై సేఫ్ గా దిగిందా లేదా? కూలిపోయిందా అన్న ఉత్కంట దేశవ్యాప్తంగా నెలకొంది.

యావత్ దేశం నిరాశలో ఉన్న వేళ ఇస్రో ఆర్బిటర్ విక్రమ్ ల్యాండర్ ఆచూకీ తెలియడంతో ఊరట కలిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -