Monday, May 13, 2024
- Advertisement -

మన తలరాతను మనమే మార్చుకోవాలి..స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం వైఎస్ జగన్

- Advertisement -

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో 73వ స్వాతంత్ర్యవేడుకల్లో పాల్గొని సీఎం హోదాలో మొదటిసారిగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందుకు ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేశారు. మన తలరాతలను మనమే మార్చుకోవాలన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 72 సంవత్సరాలు పూర్తవుతున్నా.. నేటికి సమాజంలో కొనసాగుతున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక అసమానతలు మాయనిమచ్చలుగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర సాధనకు ఎన్ని పోరాటాలు చేయాలో మన స్వాతంత్ర్య ఉద్యమం చెబుతోందన్నారు. ప్రధానంగా శాంతి, అహింసా ఆయుధాలుగా స్వాతంత్ర్యం తెచ్చుకున్నామని గుర్తు చేశారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా నవరత్నాలను రూపొందించామని జగన్ అన్నారు. తమ ప్రభుత్వ ప్రాధమ్యాలు, నవరత్నాలు, సామాజిక ప్రగతికి పెద్దపీట వేస్తూ ఇటీవల తీసుకొచ్చిన చట్టాలు, ప్రభుత్వ నిర్ణయాలను తన ప్రంసగంలో ప్రసంగించారు.

గ్రామ రూపురేఖలు మార్చేందుకు గ్రామసచివాలయాలు తీసుకొచ్చామని, రైతలుకు, పేదలకు ఉచితంగా విద్యుత్‌ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని జగన్‌ అన్నారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు కచ్చితంగా స్థానికులకే ఇస్తామన్నారు. పరిశ్రమలకు దరఖాస్తు చేస్తున్నప్పుడే స్థానికులకు శిక్షణ ఇచ్చి వెన్నదన్నుగా నిలబడాలని నిర్ణయించామన్నారు.

సామాజిక న్యాయం చరిత్రలోనే లేని విధంగా బడుగు, బలహీన వర్గాల మహిళలకు పెద్దపీట వేశామన్నారు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, నామినేషన్‌ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చే చట్టాలు తీసుకొచ్చామని, నామినేటెడ్ పదవులు, నామినేషన్‌ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తూ చట్టం తీసుకొచ్చామని, ఇలాంటి చట్టాలు తెచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం తమదేనని ఆయన పేర్కొన్నారు.

భూయాజమానులకు ఎలాంటి నష్టం కలుగకుండా కౌలురైతులకు వైఎస్సార్‌ రైతు భరోసాతోపాటు పంటల బీమా, పంటల పరిహారం అందించేందుకు చట్టం తీసుకొచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం మనదే’ అని వైఎస్‌ జగన్‌ తెలిపారు. కార్పొరేట్ సంస్కృతిని మార్చేందుకు పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ చేశామన్నారు. పేద, మధ్య తరగతి కుంటుంబాలకు అండగా నిలిచిన ప్రభుత్వం మనదని చెప్పడానికి గర్వపడుతున్నానని సీఎం జగన్‌ అన్నారు.

స్వాతంత్ర్యం అనంతరం వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించాం. అని ఆ అభివృద్ధి ఫలాలు అందాల్సిన వారికి అందలేదు. అవినీతి, దళారీ వ్యవస్థ వేగంగా బలపడింది.మీషన్లు, దోపిడీలుగా మారిన వ్యవస్థను మారుస్తున్నామని తెలిపారు. టెండర్‌ పనుల ఖరారు ప్రక్రియను హైకోర్టు జడ్జి ముందు పెడుతున్నామని, దీంతో దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా టెండర్ల ప్రక్రియలో అత్యుత్తమ విధానాలకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -