Sunday, May 12, 2024
- Advertisement -

కోడలు మృతి తో, వరంగల్ కాంగ్రెస్ అభ్యర్ధి మార్పు

- Advertisement -

అసలే వరంగల్ ఉప ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది, ఈ పరిస్థితిలో రాజయ్య (కాంగ్రెస్ వరంగల్ అభ్యర్ధి) ని కొనసాగించాలా లేక వీరేవారిని ఉంచాలా అనే అనుమానం కాంగ్రెస్ లో ఉంది. ఘోర ప్రమాదంలో రాజయ్య కోడలు తో పాటు ముగ్గురు మనుమలు కూడా చనిపోయారు. కోడలిని వేధించడం లాంటి ఆరోపణలు ఇప్పటికే ఎంపీ రాజయ్య తో పాటు అతని కొడుకు మీద కూడా పోలీసుల వద్ద కేసులు పెండింగ్ లో నడుస్తున్నాయి.

ఇదంతా జరుగుతున్న సమయంలో ఇలా జరగడం తీవ్రమైన విషయం. సో కాంగ్రెస్ ఇక తన అభ్యర్ధిని కొనసాగించాలా లేదా అనేదానిమీద పునరాలోచన చేస్తోంది. 

బుధవారం అంటే ఇవాళ  నాడు నామినేషన్లు వేయడానికి ఆఖరి రోజు అవడంతో కొత్త అభ్యర్ధి తో నామినేషన్ వేయిస్తారు అని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున వరంగల్ లో పోటీ చెయ్యాల్సిందిగా మాజీ కేంద్ర మంత్రి సర్వ్ సత్యనారాయణకి టీపీసీసీ నాయకులు ఇప్పటికే ఫోన్ చేసినట్టు చెబుతున్నారు. తక్షణం వచ్చి వరంగల్ లో నామినేషన్ వెయ్యాలి అని ఆయన్ని కోరుతున్నట్టు మనకి సమాచారం వస్తోంది. రాజయ్యని గనక తప్పించాలి అని అంటే ఆ స్థానంలో సర్వ్ నే ఆప్షన్ గా చూస్తోంది కాంగ్రెస్. ఇదివరకు వరంగల్ లో అభ్యర్ధి అంటే మొదట నుంచీ రాజ్య పేరే పరిశీలనలో ఉంది ఆయన తరవాత సర్వే పేరు ఉండేది . ఇద్దరి పేర్ల మీద కార్యకర్తల నుంచే అభిప్రాయాలు సేకరించి మరీ రాజయ్యకి సీటు ఖరారు చేసారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ లోనే ఒక వర్గం ముందు నుంచీ సర్వే న్ని దించాలి అని ఆలోచన చేస్తూ ఉండగా ఆఖరి నిమిషాల్లో ఆ సీటు కి రాజయ్య వచ్చారు. 

ఇప్పుడు ఇలాంటి ఊహించని పరిస్థ్తితి లో ‘వేకెన్సీ రిజర్వ్’ కాండిడేట్ లాగా సత్యనారాయణ ని రంగంలోకి దించేతే ప్రజలు ఎలా తీసుకుంటారు అనేది వారు ఆలోచిస్తున్నారు. ఇంతకూ అభ్యర్థిని మార్చడానికి కాంగ్రెస్‌ కసరత్తు చేస్తుండగా, పోటీకి సర్వే అంగీకరించారా లేదా అనేది మాత్రం తెలియడం లేదు. సర్వే ని అడిగిన వెంటనే నో అని గనక అంటే కాంగ్రెస్ చాలా ఇబ్బందుల్లో పడ్డట్టే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -