Monday, May 13, 2024
- Advertisement -

మోదీకి వ్య‌తిరేకంగా నిజామాబాద్ జిల్లా రైతులు వేసిన నామినేష‌న్ల తిర‌స్క‌ర‌ణ‌..

- Advertisement -

ప‌సుపు బోర్డును ఏర్ప‌టు చేయాల‌ని వార‌ణాసిలో ప్ర‌ధాని మోదీకి వ్య‌తిరేకంగా 35 మంది తెలంగాణ రైతులు వేసిన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్లను ప్రతిపాదించే వ్యక్తులు లేరంటూ వాటిని అధికారులు స్వీకరించలేదు. దీంతో రైతులు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు.

పసుపు బోర్డు ఏర్పాటు, ఎర్రజొన్నలకు మద్దతు ధర అనే డిమాండ్లతో తమ నిరసనను తెలియజేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై వారణాసిలో పోటీకి సిద్ధమయ్యారు రైతులు. అయితే, వచ్చినవారంతా నామినేషన్లు వేయకుండా చేసే ప్రయత్నం చేశారు స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు. పసుపు రైతులను అడుగు అడుగున అడ్డుకున్న సంగ‌తి తెలిసిందేనామినేషన్లు వేసేందుకు వారికి నామినిలు లేకుండా కుట్రలు చేశారని.. లాడ్జిల్లో దిగినవారి అడ్రస్ ప్రూఫ్‌లు ఇవ్వాలని లాడ్జి యజమానులపై ఒత్తిడి తెచ్చారని ఆరోపిస్తున్నారు.

వెలిగొండ సాధన సమితి అధ్యక్షుడు పూల సుబ్బయ్య మాత్రం వారణాసిలో నామినేషన్ దాఖలు చేయగలిగారు. అలాగే కొల్లూరి కిరణ్ శర్మ కూడా నామినేషన్ దాఖలు చేశారు. మోదీకి వ్యతిరేకంగా నామినేషన్లు దాఖలు చేయాలనే లక్ష్యంతో 53 మంది రైతులు వారణాసికి వెల్లిన సంగ‌తి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -