మోడీ నిద్ర పోయారా,పోలేదా?

- Advertisement -

పార్లమెంట్ లో నరేంద్ర మోడీ కునుకు తీసారు అని మీడియా కోడై కూస్తోంది. అప్పట్లో ప్రధానమంత్రుల్లో నిద్రకు పేరెన్నిక గలిగిన వ్యక్తి హెచ్ డీ దేవేగౌడ. పలు సభలు, సమావేశాల్లో ఇతర వక్తలు ప్రసంగిస్తున్నప్పుడు దేవేగౌడ నిక్షేపంగా కునుకు తీసే వారు. ఎలాంటి మొహమాటం లేకుండా ఆయన తన పనిలో ఉండేవారు. మీడియా కి ఎన్ని సార్లు చిక్కినా ఆయనది అదే ధోరణితో ఉండేవారు. 

ఇప్పుడు పరిస్థితి మారింది జనాలు నాయకుల ప్రతీ చర్యనీ తొంగి చూస్తున్నారు. మీడియా అయితే చెప్పనక్కరలేదు. వారు తుమ్మినా దగ్గినా న్యూస్ ఐపోతోంది. తాజాగా నరేంద్ర మోడీ పార్లమెంట్ సమావేశాల్లో నిద్రపోతున్నారు అంటూ కొత్త కొత్త వీడియో లూ, స్క్రీన్ షాట్ లూ కనిపిస్తున్నాయి.

- Advertisement -

ఒకవైపు హోం మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ ప్రసంగిస్తుండగా.. మోడీ కునుకు తీస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీంతో దేవేగౌడను గుర్తుచేసుకున్నారు ఆ ఫొటోను చూసిన వాళ్లు. మో

డీ అనుకూల వాదుల కీ – మోడీ వ్యతిరేకులకీ మధ్య ఈ విషయంలో చాలా పెద్ద డిస్కషన్ జరుగుతోంది. కేవలం అలా అనిపిస్తోంది తప్ప ఆయన నిద్ర పోలేదు అంటున్నారు మోడీ అనుకూల వాదులు కేవలం కింద ఎదో పుస్తకం లో చూస్తున్నారు అని అంటున్నారు వారు.

ఏదేమైనా అంతటి దేశ ప్రధాని స్థాయిలో ఉన్న మనుషులకి రోజంతా అలసటే , బోలెడు పనులు ఒత్తిళ్ళు ఉంటాయి, పైగా ఆయన వయసేమీ తక్కువ లేదు కదా ఈ తరుణంలో పొరపాటన ఒక్క కునుకేస్తే ఇదేమీ మహా పాపం కాదేమో ఆలోచించాలి.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -