- Advertisement -

అమెరికాలో మన మూర్తి కి టాప్ జాబ్

- Advertisement -

అమెరికా తదుపరి సర్జన్​ జనరల్​గా భారత సంతతి వైద్యుడు, తన కొవిడ్​-19 సలహాదారు అయిన డాక్టర్​ వివేక్​ మూర్తిని ఎంపిక చేశారు అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​. ఈ మేరకు ఆయన నియామకంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలిపింది వాషింగ్టన్​ పోస్ట్​.

ప్రస్తుతం బైడెన్​ కొవిడ్​-19 సలహా బృందంలోని ముగ్గురు సభ్యుల్లో ఒకరిగా ఉన్నారు వివేక్​ మూర్తి. ప్రజా ఆరోగ్య విభాగంలో ప్రభుత్వ చీఫ్​గా​ నాలుగేళ్ల పాటు వ్యవహరించనున్నారు. ప్రస్తుత సర్జన్​ జనరల్​ జెరోమ్​ అడమ్స్​ స్థానంలో మూర్తి బాధ్యతలు స్వీకరించనున్నారు.

గతంలో ఒబామా హయాంలోనే 2014, డిసెంబర్​ 15న సర్జన్​ జనరల్​గా నియమితులయ్యారు మూర్తి. సెనేట్​లో 51-43 మెజారిటీతో ఆయన ఎంపికకు ఆమోదం లభించింది. అయితే.. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2017, ఏప్రిల్​ 21న పదవి నుంచి వైదొలిగారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -