Tuesday, May 14, 2024
- Advertisement -

ఇండోనేసియా సముద్ర జలాల్లో భారీ భూకంపం

- Advertisement -

ఇండోనేసియా సముద్ర జలాల్లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేలుపై దీని తీవ్రత 7.3గా నమోదైంది. శనివారం ఉదయం తూర్పు ఇండోనేసియా మలూకు ద్వీపాలు కంపించాయి. సునామీ వచ్చే అవకాశముందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

 

సముద్రంలో 46 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఇండోనేసియాకు 300 కిలోమీటర్ల పరిధిలో సునామీ వచ్చే అవకాశముందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. ఇండోనేసియాతో పాటు ఫిలిప్పీన్స్, జపాన్, తైవాన్, దక్షిణ పసిఫిక్ దీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది.

2004లో సంభవించిన భూకంపం వల్ల కనీవినీ ఎరుగని రీతిలో ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. 1.70 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అపార ఆస్తి నష్టం సంభవించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -