Sunday, May 12, 2024
- Advertisement -

ఏపీ ప్ర‌భుత్వానికి ఈసీ షాక్‌…. రాష్ట్రానికి త్వ‌ర‌లో కొత్త డీజీపీ…?

- Advertisement -

త్వ‌ర‌లో ఎన్నిక‌ల నోటిఫికేషన్ వెలువ‌డ‌నున్న నేప‌ధ్యంలో ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. స‌మీక‌ర‌ణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ పై ఈసీ వేటు వేసె అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఆయ‌న‌మీద అనేక ఆరోప‌ణ‌లు వెల్లు వెత్తుతున్నాయి. ఆయన స్ధానంలో సీనియర్ డీజీ స్ధాయి అధికారి గౌతం సవాంగ్ కు బాధ్యతలు అప్పగించనున్న‌ట్లు స‌మాచారం.

ఢిల్లీలో జరుగుతున్న అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల సమావేశంలో ఈసీ ఈ మేరకు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. విశాఖ ఏయిర్ పోర్ట్‌లో జ‌గ‌న్‌పై క‌త్తితో దాడి చేసినపుడు కోడి కత్తితో చేసిన దాడి చిన్నదేనని, ఇది కేవలం ప్రచారం కోసం చేసింది మాత్రమేనని తేల్చిచెప్పారు. దాడి జరిగిన గంటన్నరలోపే నిజానిజాలు నిర్ధారించుకోకుండా ప్రెస్ మీట్ పెట్టి మరీ అత్యుత్సాహం ప్రదర్శించారు. మ‌రో వైపు ఎన్నిక‌లు స‌జావుగా జ‌ర‌గాలంటె ఏపీలో ఇంటిలిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుతో పాటు డీజీపీ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ తమను టార్గెట్ చేస్తున్నారని ఈసీకి జ‌గ‌న్ ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇవాళ డిల్లీలో జరుగుతున్న రాష్ట్రాల సీఎస్ ల సమావేశంలో డీజీపీ ఠాకూర్ తీరు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఠాకూర్‌ను కొన‌సాగిస్తె మరిన్ని సమస్యలు తప్పవనే అభిప్రాయానికి ఈసీ వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నిక‌లు అయ్యేంత వ‌ర‌కు ఆయ‌న‌ను తొల‌గించి..ఆస్థానంలో గౌతం సవాంగ్ లేదా మరో సమర్ధుడైన అధికారికి పగ్గాలు అప్పగించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -