- Advertisement -

ఏలూరు కేంద్రంగా పసిపిల్లల విక్రయం!

- Advertisement -

ఏలూరు జిల్లాలో పసిపిల్లల విక్రయం ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కైకలూరు కేంద్రంగా కొందరు కేటుగాళ్లు పసిబిడ్డలను అంగడి సరుకుల్లా మార్చి అక్రమంగా విక్రయిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముదినేపల్లి మండలం శ్రీహరిపురానికి చెందిన రెండున్నరేళ్ల బాలుడు ఆకేటి మోక్షిత్ అదృశ్యం కావడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, మోక్షిత్ ఇంటి ముందు ఆడుకుంటుండగా గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని ఎత్తుకెళ్లినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు ఇప్పటికే 13 రోజులు గడిచినా బాలుడి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కైకలూరు, ముదినేపల్లి సహా పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో అనుమానితులపై దృష్టి సారించి దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉండగా జనసేనకు చెందిన స్థానిక నేత అబ్బిశెట్టి నాగబాబు (ఏఎన్.బాబు)పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పసిపిల్లలను అక్రమంగా విక్రయిస్తున్నాడనే ఆరోపణలు అతనిపై ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఏఎన్.బాబు నిర్వహిస్తున్న షాపు వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. అయితే అప్పటికే అతను పరారీలోకి వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

బాలుడు మోక్షిత్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఏలూరు జిల్లాలో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. బాలుడిని త్వరగా గుర్తించి కుటుంబానికి అప్పగించాలని స్థానికులు కోరుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -