- Advertisement -

గ్రేటర్ ఎన్నికల ‘ఖర్చు’ 300 కోట్లా?

- Advertisement -

త్వరలో గ్రేటర్ హైదరాబాద్ కు జరగనున్న ఎన్నికలను.. అధికార పార్టీ టీఆర్ఎస్ తో పాటు.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, టీడీపీ బీజేపీ కూటమి, ఎంఐఎం పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇంకా నోటిఫికేషన్ కూడా రాకముందే.. ఈ ఎన్నికల గురించి విస్తుపోయే విషయాలు బయటికొస్తున్నాయి. విజయాన్ని టార్గెట్ గా పెట్టుకుంటున్న పార్టీలు.. ఎంత ఖర్చుకైనా తెగించేందుకు ప్లాన్ చేస్తున్నాయన్నది.. రాజకీయ వర్గాలనూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

పొత్తులు, ఎత్తులు అన్నీ పక్కన పెట్టి ఖర్చుపైనే కాన్సన్ ట్రేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఓ పార్టీ అయితే.. ఏకంగా 150 డివిజన్ల పేరు మీద 300 కోట్ల రూపాయల మొత్తాన్ని ఇప్పటికే రిజర్వ్ గా పెట్టుకుని ఉందని.. నోటిఫికేషన్ రాగానే.. అభ్యర్థుల ఎంపిక పూర్తి కాగానే… సిటీలో అసలు సీన్ మొదలు కానుందనీ వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల ప్రకారం.. అందరి అంచనాలు నిజమైతే సంక్రాంతి పండగ రోజుల్లోనే అసలు కథ పూర్తి కానుంది. ఆంధ్రా ప్రజలు సొంతూళ్లకు వెళ్తే.. పక్కాగా లోకల్ పబ్లిక్కే హైదరాబాద్ లో ఉంటారు. ఆ టైమ్ లో ఎన్నికలు నిర్వహించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటూ ప్రచారం కూడా జరుగుతోంది. అందుకు తగ్గట్టే సిటీలో ఎటు చూసినా.. ప్రభుత్వ కార్యక్రమాలు గమనించినా.. గ్రేటర్ ఎన్నికల కాన్సెప్ట్ చుట్టూనే తిరుగుతున్నాయి.

ఇలాంటి టైమ్ లోనే.. రాజకీయ పార్టీలు పెడుతున్న ఖర్చు గురించి నమ్మశక్యం కాని లెక్కలు బయటికొస్తున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -