Monday, May 13, 2024
- Advertisement -

కారు ఎక్కేందుకు రెడీ!

- Advertisement -

వరంగల్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో.. వలసల రాజకీయాలు మళ్లీ మొదలయ్యాయి. ఎన్నికలు జరుగుతున్న వరంగల్ నుంచే జంపింగ్ లు  మొదలు కావడం.. అదీ అధికార పార్టీలోకి వలసలు జరగడం ఆసక్తికరంగా మారింది. నోటిఫికేషన్ విడుదలైనా కూడా ఏ ప్రధాన పార్టీ అభ్యర్థిని ఖరారు చేయకపోవడం..

ప్రత్యర్థి పార్టీలు ఎవరిని బరిలో నిలబెడతాయని అన్ని పార్టీలూ ఎదురుచూడడంతో.. ఉప ఎన్నిక కాస్తా.. అసలు ఎన్నికలా మారిపోయింది. ఇలాంటి సమయంలో.. అధికార టీఆర్ఎస్ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ ను అమలు చేస్తుండడం.. ఆ బాధ్యతను పార్టీకి మూల స్తంభంలాంటి కీలక మంత్రి, సీనియర్ నాయకుడికి అప్పగించినట్టు వార్తలు వస్తున్నాయి. 

ఈ గుసగుసలకు బలం తెస్తూ.. టీడీపీ రాజ్యసభ ఎంపీ, వరంగల్ జిల్లాలో పార్టీ ముఖ్య నాయకురాలిగా ఉన్న గుండు సుధారాణి… ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడం.. అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. తమ భేటీకి ఎలాంటి ప్రత్యేకత లేదని.. అభివృద్ధి కార్యక్రమాలను అభినందించేందుకే సీఎంను కలిశానని సుధారాణి విలేకరులకు చెబుతున్నా.. ఇలాంటి టైమ్ లో కేసీఆర్ ను కలవడం వెనక ఆంతర్యం ఏంటన్నదీ ఎవరికైనా అర్థమయ్యే విషయమే.

వరంగల్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన కొన్ని రోజులకే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరగనున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకునే.. గుండు సుధారాణి టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందుకే ప్రత్యేకంగా ఢిల్లీలో సీఎం కేసీఆర్ ను కలిసినట్టు వార్తలు జోరందుకున్నాయి. అంతేకాక.. వరంగల్ లో పార్టీకి బలం తీసుకురావాలంటే.. బీసీ నాయకురాలిగా మంచి పట్టున్న సీనియర్ నేత సుధారాణిని పార్టీలో చేర్చుకోవడం మంచిదని అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా భావిస్తున్నట్టు సమాచారం. రెండు వైపులా రాజకీయ అవసరాలు ఉండడం.. సమయానికి వరంగల్ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక రూపంలో అవకాశం రావడంతోనే… సుధారాణి గులాబీ కండువా కప్పుకొనే పరిస్థితి ఏర్పడిందని అనలిస్టులు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -