Saturday, May 11, 2024
- Advertisement -

అఖిల ప్రియ స‌హా న‌లుగురికి కోర్టు నోటీసులు..

- Advertisement -

ఒక పార్టీకి ఊర‌ట‌…మ‌రొక పార్టీకి షాక్.ఏపీలో పిరాయింపుల‌పై మ‌రింత‌గా రాజ‌కీయాలు ఉపందుకోకున్నాయి.వైసిపి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి, టిడిపిలో చేరి, మంత్రి పదవులు అనుభ‌విస్తున్న సంగ‌తి తెలిసిందె.అయితే ఇప్పుడు వారికి స‌మ‌స్య‌లు త‌ప్ప‌డంలేదు. నలుగురు పిరాయింపు మంత్రులకు కోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపులపై నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలంటూ కోర్టు నోటీసుల్లో పేర్కొంది.
చంద్ర‌బాబుకు షాక్ అయితే…వైసీపీకి బ్ర‌హ్మాస్త్రం దొరికింది.వైసీపీ తరపున గెలిచి టిడిపిలోకి ఫిరాయించి మంత్రులైన భూమా అఖిలప్రియ, ఆదినారాయణరెడ్డి, ఎన్.అమరనాధరెడ్డి, సుజయ కృష్ణ రంగారావులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించి మంత్రి పదవులు అనుభవించటం రాజ్యాంగ విరుద్ధమంటూ శివప్రసాద్ అనే జర్నలిస్టు దాఖలు చేసిన కేసును హైకోర్టు పరిశీలించింది.
ఉపఎన్నికలతో ఇబ్బంది పడుతున్న చంద్రబాబునాయుడుకు తాజాగా నలుగురు మంత్రులకు కోర్టు నోటీసులు జారీ చేయటం మరింత ఇబ్బందికరమే. ఈ నాలుగు వారాల్లోనే గనుక ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైతే చంద్రబాబుకు మరింత ఇబ్బందే.
భూమా నాగిరెడ్డి మరణం వల్లే నంద్యాలలో ఉపఎన్నిక అవసరమైంది. విచిత్రమేంటంటే భూమా కూడా ఫిరాయింపు ఎంఎల్ఏనే. అంటే ఫిరాయింపు ఎంఎల్ఏ మరణం వల్ల జరుగనున్న నంద్యాల ఉపఎన్నికలో మిగిలిన నలుగురు ఫిరాయింపు మంత్రులు బాగా యాక్టివ్ గా ఉన్నారు.కోర్టు నోటీల‌సుతో స్పీడ్‌కు బ్రేక్ ప‌డిన‌ట్లేననే వార్త‌లు వినిపిస్తున్నాయి.
ఇపుడు కోర్టు ఆదేశాల రూపంలో వైసీపీకి బ్రహ్మాస్త్రం దొరరికినట్లైంది. ఎందుకంటే, ఫిరాయింపులకు వ్యతిరేకంగా వైసీపీ ఎంఎల్ఏలు కూడా కోర్టులో పోరాటం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సరిగ్గా ఉపఎన్నిక హీట్ పెరిగిపోతున్న సమయంలో కోర్టు స్పందించి నలుగురు మంత్రులకు నోటీసులు జారీ చేయటమంటే మామూలు విషయం కాదు.
రేపు ప్రచారంలో ఫిరాయింపు మంత్రులు జనాలకు ఏమని చెబుతారు? ప‌్ర‌జ‌ల‌ను ఎలా ఓట్లు అడుగుతారు? అడ్డుగోలుగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు ప్రచారంలో ఏం మాట్లాడుతారు? కోర్టుకు ఈ నలుగురు ఫిరాయింపు మంత్రులు ఏమని సమాధానం చెబుతారో చూడాలి.ఉప ఎన్నిక‌లో అధికార ప‌ర్టీకి ఒట‌మి త‌ప్ప‌దనే స‌ర్వేలు చెప్తున్నాయి…మ‌రి కోర్టు నోటీసుల‌రూపంలో మ‌రొ త‌ల‌నొప్పి వ‌చ్చిప‌డింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -