Tuesday, May 14, 2024
- Advertisement -

రామంతాపూర్‌లోని హోమియోపతి ఆస్పత్రికి పెరిగిన రోగుల తాకిడి

- Advertisement -

ఎయిడ్స్‌ వ్యాధిని పూర్తిగా న‌యమ‌య్యేందుకు ప్ర‌పంచంలో మందులు లేవు.కాని భ‌యంక‌ర వ్యాధిని నయం చేయడానికి హోమియోపతి వైద్యులు చేస్తున్న కొత్త రకం చికిత్స మంచి ఫలితాలను ఇస్తోంది.

పాము విషంతో తయారుచేసిన ఔషధంతో ఈ భయంకరమైన వ్యాధిని పూర్తి స్థాయిలో నివారించగలుగుతున్నారు. రెండేళ్లుగా చేస్తున్న ఈ ప్రయోగంలో ఇప్పటికే 30 మందికి పూర్తి స్థాయిలో వ్యాధి నయం కాగా, మరో 3వేల మందికి వ్యాధి తీవ్రత తగ్గినట్టు పరీక్షల్లో తేలింది.నమ్మకం పెరగడంతో రామంతాపూర్‌లోని హోమియోపతి ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది.

గ‌త రెండు సంవ‌త్స‌రాల‌నుంచి మొత్తం 11 వేల మంది రోగులు ఇక్కడ వైద్యం పొందుతున్నారు. తెలంగాణ, ఏపీ నుంచే గాక పక్క రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల నుంచికూడా రోగులు వస్తున్నారు. రెండేళ్ల క్రితం డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో చికిత్స విధానంలో కొంత మార్పుచేసి, కొత్త రకం మందును వాడటం మొదలు పెట్టారు. పాము, తేలు విషం నుంచి తయారు చేసిన ‘క్రోటలస్‌ హారిడస్‌’ అనే మందును ఎయిడ్స్‌ రోగుల కోసం ఉపయోగిస్తున్నారు. ఈ ఔషధం వాడకంవల్ల హెచ్‌ఐవీ రెట్టింపు కాకుండా లేదా పెరగకుండా నివారిస్తుందని కనుగొన్నారు. హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ) కూడా దీనిపై పలు పరిశోధనలు చేయగా, ఈ మందు ఎయిడ్స్‌ రోగులపై మంచి ప్రభావాన్ని చూపుతుందని తేలింది. అప్పటి నుంచి ఈ ఔషధంతో రామంతాపూర్‌ హోమియోపతి ఆస్పత్రికి వచ్చే రోగులకు చికిత్స చేస్తున్నారు.

చికిత్స పొందుతున్న వారందరి వివరాలను నమోదుచేసి.. వారం, నెల, ఆరు మాసాల చొప్పున ప్రత్యేక పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షల్లో మంచి ఫలితం కనిపించింది. ముఖ్యంగా రోగుల్లో ఆకలి, బరువు పెరగడం.. చర్మవ్యాధులు తగ్గడం, ఇన్ఫెక్షన్‌ రాకపోవడం, దగ్గు, జ్వరం వంటివి కూడా తగ్గిపోవడాన్ని గుర్తించారు. రక్తంలో ‘సిడి-4’ కణాల పెరుగుదల, వ్యాధి నివారణ శక్తిపై కూడా ఔషధం ప్రభావం ఉన్నట్టు గుర్తించారు.

రోజురోజుకీ రోగుల తాకిడి పెరగడంతో రామంతాపూర్‌ హోమియో ఆస్పత్రిని విస్తరించాలని నిర్ణయించినట్టు ఆయుష్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాజేందర్‌రెడ్డి చెప్పారు. అందులో భాగంగా ఓపీ బ్లాకును ఆధునీకరిస్తున్నామని, రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని వైద్యుల సంఖ్యను పెంచామన్నారు. అలాగే పీజీ డాక్టర్ల సేవల్ని కూడా ఉపయోగిస్తున్నట్టు పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -