ప్రేమలో ఓడిపోయి యువ డాక్టర్ సూసైడ్

- Advertisement -

హైదరాబాద్ లో మరో యువ డాక్టర్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. కష్టపడి చదివి డాక్టర్ అయ్యి ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ డాక్టర్ అర్ధాంతరంగా మరణించడం అందరినీ షాక్ కు గురిచేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి తనను విడిచిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయిందన్న డిప్రెషనే ఆ యువ డాక్టర్ బలవన్మరణానికి కారణమని తెలుస్తోంది.

మంచిర్యాల జిల్లా రామకృష్ణాపురం కు చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు ఆగయ్య ఐదేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి కుత్బుల్లాపూర్ గాయత్రినగర్ లోనివసిస్తున్నాడు. ఇతడికి నలుగురు పిల్లలు. చిన్నవాడైన దాసరపు సుభాష్ (32)ను డాక్టర్ చదవించాడు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా బాగా చదివిన సుభాస్ ఏకంగా యశోద ఆస్పత్రిలోకార్డియాలజిస్ట్ గా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలోనే గాంధీ ఆస్పత్రిలో ఈఎన్టీ డాక్టర్ గా పనిచేస్తున్న నిత్యతో పరిచయం అయ్యింది. ఇద్దరూ ప్రేమించుకొని 2017లో ఆర్యసమాజ్ లో పెద్దలకు చెప్పకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు.

తల్లిదండ్రులకు చెప్పి వస్తానని కేరళ వెళ్లిన నిత్య నెలలు గడుస్తున్నా తిరిగి రాలేదు. సుభాష్ తల్లిదండ్రులు ప్రేమ వివాహాన్ని అంగీకరించలేదని.. వాళ్లు ఒప్పుకుంటేనే తిరిగి వస్తానని చెప్పినట్టు సమాచారం. దీంతో సుభాష్ మనోవేదనకు గురయ్యాడు. తీవ్ర డిప్రెషన్ తో మత్తు ఇంజెక్షన్ తీసుకొని చనిపోయాడు.

ఇలా తల్లిదండ్రులను ఒప్పించలేక.. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని రప్పించలేక యువ డాక్టర్ తనువు చాలించిన వైనం అందరినీ కలిచివేసింది.

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -