Tuesday, May 7, 2024
- Advertisement -

ఆ రాజకీయ పార్టీలో వివాహేతరసంబంధాల లొల్లి!

- Advertisement -

ఈ మధ్యకాలంలో ఆమ్ ఆద్మీ పార్టీలో వివాదాలు ఎక్కువ అవుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ల్యాండ్ స్లైడ్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక్కడ నుంచి ఆప్ సరికొత్త రాజకీయ అధ్యాయాలను ప్రారంభిస్తుందని ఆ పార్టీ అభిమానులు అయినా సామాన్యులు ఆశించారు.

మరి ఆ దిశగా సాగాల్సిన ఆమ్ ఆద్మీ పార్టీ అనుకోని వివాదాల పాలవుతోంది. మొన్నటి వరకూ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై నాయకత్వంపై విమర్శలు వచ్చాయి. పార్టీకి కేజ్రీవాల్ నియంతగా మారాడని ఆ పార్టీ ఎదుగుదల కోసం కృషి చేసిన నేతలు ఆరోపించారు. వారిని పార్టీ నుంచి బహిష్కరించి ఆ వివాదాన్ని ఎలాగోలా పరిష్కరించుకొన్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు.. ఆ పార్టీలో వివాహేతర సంబంధాల లొల్లి మొదలు కావడం విశేషం. ఆప్ లో పనిచేస్తున్న ఒక మహిళా కార్యకర్త ఇప్పుడు మీడియాకు ఎక్కింది. పార్టీలో తన గురించి దుష్ప్రచారం చేశారని.. అంటూ ఆమె అంటోంది. తనకూ ఆప్ నేత కుమార్ విశ్వాస్ కు అక్రమ సంబంధం ఉందని ప్రచారం చేశారని ఆమె అంటోంది. దీంతో తన భర్త ఈ ప్రచారాన్ని నమ్మి ఇప్పుడు తనను వదిలేవాడని వాపోతోంది. 

భారతీయ జనతా పార్టీ వారు కూడా ఈ ప్రచారంలో భాగస్వామ్యులేనని ఆమె అంటోంది. అయితే ఈ ప్రచారం అబద్ధమని కుమార్ విశ్వాస్ ప్రకటించలేదని.. దీంతో తన భర్త తనను వదిలేశాడని.. ఇప్పుడు తన పరిస్థితి ఏమిటి? అంటూ.. ఆమె వాపోతోంది! దీంతో ఇప్పుడు ఈ అంశం మీడియాలో చర్చగా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీలో ఇలాంటి వివాదాలు కూడా మొదలయ్యాయా.. అంటూ సామాన్యులు ఆశ్చర్యపోతున్నారు! మరి ఆప్ కు ఇలాంటి వివాదాలు మంచివేనా?! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -