Monday, May 13, 2024
- Advertisement -

జగన్ అప్పుడే.. ‘సీఎంగా తొలి సంతకం’ హామీని ఇచ్చేశాడు..!

- Advertisement -

ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉన్నా.. అప్పుడే వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలు లక్ష్యంగా ప్రసంగాలు చేస్తున్నాడు.

తను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో చెబుతున్నాడు. సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఇంకా ఒక ఏడాదే అయినా.. మళ్లీ ఎన్నికలు రావడానికి నాలుగేళ్ల సమయం ఉన్నా..

జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడే ఈ విషయాలు మాట్లాడుతుండటం విశేషం. ఇంతకీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీఅ ధ్యక్షుడు ఏమంటాడంటే.. తను అధికారంలోకి వస్తే వాల్మీకులను ఎస్టీ క్యాటగిరీలోకి చేరుస్తానని అంటున్నాడు.

వచ్చే ఎన్నికల విషయంలో జగన్ ఈ విధంగా తొలి హామీని ఇచ్చాడు. తను సీఎంను అయితే ఈ విషయంలోనే తొలిసంతకం చేస్తాననిన జగన్ అనంతపురంజిల్లా రైతు భరోసా యాత్రలో ప్రకటించాడు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల ముందు ఇలాగే తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిలు పోటా పోటీగా తొలి సంతకం హామీలు ఇచ్చారు. అయితే చంద్రబాబు రైతురుణమాఫీ హామీబలంగా పనిచేసింది. అధి సాధ్యం కాదు అని జగన్ అన్నప్పటికీ.. బాబు దాన్ని చేసి చూపిస్తానని అన్నాడు.

ముఖ్యమంత్రి అయితే తొలి సంతకం దాని మీదే చేస్తానని అన్నాడు. మరి రైతురుణమాఫీ జరిగిందో లేదో కానీ.. తెలుగుదేశం పార్టీకి అయితే రుణమాఫీ హామీతో అధికారం సిద్ధించింది. ఇలాంటి నేపథ్యంలో జగన్ ప్రతిపక్ష నేతగా జనాల్లోకి వెళుతున్నాడు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా జగన్ ఇప్పుడే హామీలు ఇస్తున్నాడు. తను సీఎం అను అయితే.. అంటూ ఆ హామీలు ఇస్తున్నాడు. మరి వైకాపా అధినేత ఇప్పటి నుంచే కష్టపడుతున్నట్లున్నాడు!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -