Thursday, May 23, 2024
- Advertisement -

ప్ర‌శాంత్ కిషోర్‌తో డీల్… 2019 ఎన్నికలకు జ‌గ‌న్ ప‌క్కావ్యూహం..

- Advertisement -
Jagan Hires Prashant Kishor For Rs 250 Cr in 2019 elections

2014 ఎన్నిక‌ల్లో విజ‌యం త‌మ‌దేన‌ని భావించిన జ‌గ‌న్‌కు చేదు అనుభ‌వం ఎదుర‌య్యింది.  ప‌వ‌ణ్ క‌ళ్యాన్ రూపంలో వైసీపీకీ శ‌ని వెంటాడింది.అయితే ఇప్ప‌డు వ‌చ్చే సాధార‌న ఎన్నిక‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకున్న జ‌గ‌న్  గెలుపే ల‌క్ష్యంగా  ప‌క్కాప్లాన్‌తో వెల్తున్నారు.

రాబాయే ఎన్నిక‌ల‌ను చావో రేవు అనే విధంగా  భావిస్తున్న జ‌గ‌న్ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా మంచి పేరున్న ప్ర‌శాంత్ కిషోర్ అనే బానాన్ని జ‌గ‌న్ ప్ర‌యేగించ‌బోతున్నారు. రెండు వైపులా జ‌గ‌న్ క‌త్తికి ప‌ప‌దును పెడుతున్నారు.

ఎవ‌రీ ప్ర‌శాంత్ కిషోర్ అనుకుంటున్నారా..2014 ఎన్నిక‌ల్లో బీజేపీ ప్ర‌చారంఅంతా ప్ర‌శాంత్‌కిషోర్ చూసుకున్నారు. ఎన్నిక‌ల్లో బీజేపీ తిరుగులేని విజ‌యం సాధించి సొంతంగా  అధికారం చేప‌ట్టింది. త‌ర్వాత బీహార్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా నితీష్‌కుమార్ త‌రుపును ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్తాగా వ్య‌వ‌హ‌రించారు.అంతే అక్క‌డ‌కూడా నితీష్‌కూట‌మి తిరుగులేని విజ‌యం సాధించింది.ప్ర‌శాంత్ కిషోర్‌ణు ప‌క్క‌న పెట్టిన బీజేపీ ఘోరంగా విఫ‌ల‌మ‌య్యింది.

దేశవ్యాప్తంగా పార్లమెంటుకు, అసెంబ్లీలకు 2018 అక్టోబర్‌లో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న వార్తలు వెలువడగానే జగన్ వెంటనే ప్రశాంత్ కిషోర్‌తో భేటీ అయి భారీ మొత్తం చెల్లించి ఆయనతో ఒప్పందానికి జగన్ 250 కోట్లు చెల్లించారని వార్త‌లు హ‌ల‌చ‌ల్ చేస్తున్నాయి.జ‌గ‌న్ కోరిక మేర‌కే ప్ర‌శాంత్ అండ్ టీం  ఏపీలో  వైసీపీ ప‌రిస్థితుల‌పై దృష్టి పెట్టిన‌ట్లు స‌మాచారం.ఇక‌నుంచి ప్ర‌శాంత్ కిషోర్ పూర్తి స్థాయిలో ప‌నిచేస్తార‌ని వైసీపీనేత‌ల‌కు జ‌గ‌న్ చెప్పిన‌ట్లు స‌మాచారం.దీన్లో భాగంగానే  అన్ని నియేజ‌క వ‌ర్గాల‌లో బూత్‌స్థాయి క‌మిటీలు  ఏర్పాటు చేయాల‌ని పార్టీ శ్రేనుల‌కు జ‌గ‌న్ సూచించారు.త‌ర్వాత ప్ర‌శాంత్ కిషోర్ ఎన్నిక‌ల వ్యూహానికి సంబంధించిన సూచ‌న‌లు,స‌ల‌హాలు ఇస్తార‌ని వైసీపీ నేత‌ల‌కు జ‌గ‌న్ చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

ఇటీవ‌ల పార్టీ నేత‌ల‌తో జ‌గ‌న్ వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హిస్తూ క్యాడ‌ర్‌ను అప్ర‌మ‌త్తం చేస్తున్నారు.ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా అందుకు సిద్ధంగా ఉండాల‌ని పిలుపు నిచ్చారు.గ‌త ఎన్నిక‌ల్లో చేసిన చిన్న చిన్న‌త‌ప్పుల కార‌నంగా ఒట‌మిని చ‌విచూడాల్సి వ‌చ్చింద‌ని…ఇక ఈసారి అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌కుండా చూసుకోవాల‌ని స‌ల‌హాలు ఇచ్చారు.2019 ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్థిపార్టీల‌కు ఎటువంటి ముంద‌స్తు అవ‌కాశం  ఇవ్వోదనే అలోచ‌న‌తోనే జ‌గ‌న్ ప్ర‌శాంత్ కిషోర్‌తో కాంటాక్ట్ అయ్యార‌ని వైసీపీ నేత‌లు చెప్పుకుంటున్నారు.

టీడీపీ ప్ర‌భుత్వంపై ఉన్న అసంతృప్తిగా ఉన్న వ‌ర్గాల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌డానికి ప్ర‌శాంత్ కిషోర్ సూచ‌న‌లు,స‌ల‌హాలు ఉప‌యేగ‌ప‌డ‌తాయ‌ని జ‌గ‌న్ పూర్తిగా న‌మ్ముతున్నారు.ముఖ్యంగాఎన్నిక‌ల ప్ర‌సంగాల‌తో ఎలా అకట్టుకోవాలి,ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల‌కు అర్త‌మ‌య్యే విధంగా ఎలా వివ‌రించాల‌నే సూచ‌న‌ల‌ను ..పార్టీ నేత‌ల‌తో పాటు జ‌గ‌న్‌కుకూడా స‌ల‌హాలు ఇవ్వ‌డానికి ప్ర‌శాంత్ టీం సిద్దంగా ఉంద‌న్న‌ట్లు స‌మాచారం.

అయితే ఉత్తర ప్రదేశ్‌ కాంగ్రెస్ పార్టీకి సహాయం చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న ప్రశాంత్ ఘోరంగా విఫలమవడంతో అతడిని తీసుకోవాలా వద్దా అనే విషయంలో వైకాపాలో రెండో ఆలోచన వచ్చిందని కూడా తెలుస్తోంది. యూపీ ఎన్నికల అనుభవం చూశాక ప్రశాంత్‌తో కలిసి పనిచేసే ఆలోచన మానుకోవాలని పలువురు సీనియర్ పార్టీ నేతలు, కొంతమంది ఎంపీలు కూడా జగన్‌కు సలహా ఇచ్చారట.ఎందుకంటే ప్రశాంత సహాయం తీసుకుని యూపీ ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్ మొత్తం 403 స్థానాలకు గానూ కేవలం 7 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ చరిత్రలో అదొక ఘోర వైఫల్యం. దాంతో వైకాపా నేతలు ప్రశాంత్‌తో జట్టు కట్టడంపై పెదవి విరిచారు.  కానీ జగన్ వినలేదు. ప్రశాంత్ పార్టీకోసం పని చేస్తారని, అతడు తప్ప తనకు ఎవరిమీదా నమ్మకం లేదని జగన్ తేల్చి చెప్పేశారట.

 ఈ సంవత్సరం జూన్ నుంచి ప్రశాంత్ టీమ్ వైకాపా కోసం పని ప్రారంభిస్తుంది. ప్రశాంత్ టీమ్ మొదట తెలుగు దేశం ప్రభుత్వంపై ఏర్పడిన తీవ్ర వ్యతిరేకతతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితిని ముందుగా అంచనా వేస్తుంది. తర్వాత సెప్టెంబర్ నుంచి ప్రశాంత టీమ్ తన వ్యూహాన్ని అమలు పరుస్తుందని వైకాపా సీనియర్ నేత ఒకరు చెప్పారు.

 ప్రశాంత్‌తో ఒప్పందానికి జగన్ 250 కోట్లు చెల్లించారని చెబుతున్న ఈ వార్తను నమ్మాలో లేదో తెలియడం లేదు కానీ నిజమే అయితే ఈ సారి ఎన్నికల్లో గెలుపుకోసం జగన్ ఏ స్థాయికి వెళ్లనున్నారో అర్థమవుతుంది. మ‌రి ప్ర‌శాంత్ ఎన్నిక‌లవ్యాహం ఎంత‌వ‌ర‌కు ప‌లిస్తుందో చూడాల‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

  1. వచ్చే ఎన్నికల నేపథ్యంలో రైతులు, కూలీలకు సూపర్ ఆఫర్ ప్రకటించిన వైసీపీ
  2. జగన్ పై లోకేష్ మరో బ్లండర్ మిస్టేక్.. టీడీపీనేతలే నవ్వుతున్నారు
  3. వైకాపాలోకి పురందేశ్వ‌రీనా..?
  4. జగన్ సవాల్.. వణికిపోతున్న బాబు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -