Saturday, May 4, 2024
- Advertisement -

కాశ్మీర్‌లోని చత్తబల్ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్…ముగ్గురు తీవ్ర‌వాదులు హ‌తం

- Advertisement -

జమ్ము కశ్మీర్‌లోని చట్టబాల్‌లో భారీ ఎన్ కౌంట‌ర్ జ‌రిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో భారత భద్రతా దళాలు ముగ్గురు ముష్కరుల్ని మట్టుబెట్టాయి. తీవ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన ఈ పోరులో అసిస్టెంట్ కమాండెంట్ తో సహా ముగ్గురు సీఆర్పీఎఫ్ సిబ్బంది కూడా గాయపడ్డారు. దాడి జరిగిన ప్రాంతంలో మూడు ఏకే రైఫిల్స్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఘటనలో మరో ముగ్గురు ఫొటోగ్రాఫర్లకు కూడా గాయాలయ్యాయి. అయితే.. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతి చెందారంటూ స్థానికులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ముందు జాగ్రత్త చర్యగా ఘర్షణ ప్రాంతాల్లో అధికారులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

ఆందోళనకారులు భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వ‌డంతో ప్రతిగా భారత సైన్యం భాష్పవాయువులు ప్రయోగించింది. అక్కడ జరిగిన ఓ రోడ్ యాక్సిడెంట్ కారణంగానే కశ్మీర్ పౌరులు మరణించారని, వారి మృతికి భారత భద్రతా దళాల కాల్పులకు ఎలాంటి సంబంధంలేదని అధికారులు తేల్చి చెప్పారు. వారి మృతికి భద్రతా దళాల వాహనాలు కారణం అనడంలోనూ ఎలాంటి వాస్తవం లేదని వారు వివరించారు.

చత్తబల్ ప్రాంతంలో తీవ్రవాదుల ఉనికి ఉందని తెలియడంతో భద్రతాబలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ని ప్రారంభించాయని, ఈ క్రమంలోనే భద్రతాబలగాలకు, తీవ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయని ఓ అధికారి తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -