- Advertisement -

బాబుకు సినిమా స్టార్టయింది…… సుప్రీం కోర్ట్‌లో బుక్డ్….. బయటపడే ఛాన్స్ లేదట

- Advertisement -

వీడియా, ఆడియో సాక్ష్యాలతో సహా ప్రజలందరి కళ్ళకు కనిపించిన ఒక అవినీతి, అక్రమ వ్యవహారంలో నీచమైన తప్పులకు పాల్పడిన నిందితులకు శిక్ష పడకుండానే కేసు ముగిసిపోతుందా? అవినీతి, అక్రమ వ్యవహారాలే ఆలంబనగా చేసుకుని రాజకీయ పదవులు పొందేవారికి మరి కాస్త ధైర్యాన్ని ఇస్తుందా? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినవాళ్ళు రొమ్ము విరుచుకుంటూ నిప్పులా బ్రతికాం అని ధైర్యంగా అబద్ధాలు చెప్పుకుంటూ అధికారం అనుభవిస్తారా?

ఓటుకు కోట్లు కేసు సమసిపోవడం ఖాయం అని టిడిపి భజన మీడియా ప్రజలను నమ్మించాలని చూసినప్పుడల్లా ప్రజాస్వామ్యవాదులు, ఆలోచనాపరులు అయిన ప్రజల్లో రేకెత్తిన ఆలోచనలు అవే. తప్పు చేస్తూ అడ్డంగా దొరికిపోయినవారు కెసీఆర్‌కి భయపడి, కెసీఆర్ దగ్గర సాగిలపడిపోయినంత మాత్రాన చేసిన తప్పుకు శిక్ష పడకుండా తప్పించుకోగలరా? ఐదు కోట్ల సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెడుతూ పదేళ్ళపాటు సర్వ హక్కులూ ఉన్న హైదరాబాద్ వదిలివెళ్ళడం, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడం లాంటివి చేసి కేసు నుంచి తప్పించుకోవడం సాధ్యమేనా? మోడీ, కెసీఆర్ దగ్గర సాగిలపడితే నేరం బయటపడకుండా పోతుందా? శిక్షలు పడకుండా ఉంటాయా? అని ఆలోచించినవాళ్ళకు ఇప్పుడు సమాధానం దొరికేసింది.

కేసుతో సంబంధం ఉన్న జెరూసలేం మత్తయ్య అప్రూవర్‌గా మారి అన్ని నిజాలు చెప్పేస్తానని స్వయంగా సుప్రీంకోర్ట్ ఛీఫ్ జస్టిస్‌కి లేఖ రాశాడు. లాయర్ కూడా అవసరం లేదన్నాడు. తనకు ఓటుకు కోట్లు కేసులో నిందితులు అయినవాళ్ళ నుంచి ప్రాణహాని ఉందన్నాడు. సుప్రీం కోర్ట్ ఒప్పుకుంటే అప్రూవర్‌గా మారిపోతానని, అన్ని నిజాలూ చెప్పేస్తానని చెప్పుకొచ్చాడు. ఆల్రెడీ ఓటుకు కోట్లు కేసు ఇప్పటికే సుప్రీం కోర్ట్ తలుపు తట్టి ఉంది. ఇక ఇప్పుడు ఆ కేసులో భాగమయిన మత్తయ్య స్వయంగా తానే అప్రూవర్‌గా మారిపోతానని సుప్రీం కోర్ట్‌కి విన్నవించుకోవడంతో ఓటుకు కోట్లు కేసులో బ్రీఫింగ్ ఇచ్చిన నాయకుడు, వీడియోలో కనిపించని నాయకుడు కచ్చితంగా బుక్కవ్వడం ఖాయం అని సుప్రీం కోర్ట్ న్యాయవాదులు చెప్తున్నారు. నిందితుడే అప్రూవర్‌గా మారి సాక్ష్యం ఇస్తే….ఆ కేసు చాలా బలంగా మారుతుందని….తప్పకుండా శిక్షలు పడుతాయనే వాదనలు వినిపిస్తున్నాయి. బ్రీఫింగ్ ఇచ్చినవారు, తెర వెనుక మంత్రాంగం నడిపినవారు, వీడియోలో కనిపించనవారు……మొత్తంగా తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అత్యంత సంచలనంగా…….అత్యంత అవినీతి, అక్రమ వ్యవహారంగా నిలిచిపోయిన ఈ కేసులో తప్పు చేసిన వాళ్ళందరికీ కూడా శిక్షలు పడాలని….భవిష్యత్తులో తప్పులు చేయాలనే ఉద్ధేశ్యం, ఆలోచనలు ఉన్నవారందరూ కూడా భయపడేలా ఆ శిక్షలు ఉండాలని మనమూ కోరుకుందాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -