- Advertisement -

వరల్డ్ కప్ ఫైనల్..రికార్డు వ్యూస్!

- Advertisement -

క్రికెట్ మైదానంలో మాత్రమే కాదు, డిజిటల్ స్క్రీన్లపైనా చరిత్ర సృష్టించిన మ్యాచ్‌గా ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ నిలిచింది. ఈ మొత్తం టోర్నమెంట్‌ను Jio Hotstar లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.

ఫైనల్ మ్యాచ్ సమయంలో ఈ ప్లాట్‌ఫామ్‌పై అపూర్వమైన ట్రాఫిక్ నమోదైంది. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, ఫైనల్ మ్యాచ్‌ను చూడటానికి 80 మిలియన్లకు పైగా ప్రేక్షకులు ఒకేసారి జియో హాట్‌స్టార్‌లో లాగిన్ అయ్యారు.

భారతదేశ జనాభా సుమారు 1.48 బిలియన్ ఉండగా, అంత పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఒకేసారి ఒకే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో మ్యాచ్‌ను వీక్షించడం డిజిటల్ ప్రపంచంలో గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు.

అయితే ఈ 80 మిలియన్ల సంఖ్య కేవలం జియో హాట్‌స్టార్‌లో మ్యాచ్‌ను చూసిన ఓటీటీ ప్రేక్షకులను మాత్రమే సూచిస్తుంది. టెలివిజన్‌లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి మ్యాచ్‌ను వీక్షించిన లక్షలాది మంది ప్రేక్షకులను కూడా కలుపుకుంటే, మొత్తం వీక్షకుల సంఖ్య మరింత భారీగా ఉండే అవకాశం ఉంది.

మైదానంలో భారత జట్టు లెజెండరీ ప్రదర్శన ఇస్తే, దేశవ్యాప్తంగా అభిమానులు కూడా అదే స్థాయిలో చారిత్రాత్మకంగా ఈ మ్యాచ్‌ను వీక్షించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -