Sunday, May 5, 2024
- Advertisement -

ల‌క్ష‌లాది మందికి న్యాయ సాయం అందట్లేదు: సుప్రీం జడ్జి జస్టిస్​ ఎన్వీ రమణ

- Advertisement -

దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 74 సంవ‌త్స‌రాలు అవుతున్నా ఇప్ప‌టికీ ల‌క్ష‌లాది మందికి న్యాయ స‌హాయం అంద‌డం లేద‌ని ఆయ‌న పేర్కొన్నారు. అలా న్యాయం స‌హాయం అంద‌ని వారితో పాటు దేశంలోని ప్ర‌త ఒక్క‌రికి న్యాయం స‌హాయం అందేలా న్యాయ‌వాదులంద‌రూ కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు.

నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) 25వ వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ మాట్లాడుతూ.. పై వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో న్యాయం స‌హాయం కోసం ఇంకా ల‌క్ష‌లాది మంది ఎదురుచూస్తున్నార‌ని తెలిపారు. స్వాంతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి మ‌న రెండు స‌మ‌స్య‌ల‌తో పోరాడుతున్నామ‌ని వెల్ల‌డించారు. అందులో మొద‌టిది పేద‌రికం, రెండోది న్యాయం అంద‌క‌పోవ‌డం అంశాలున్నాయ‌ని తెలిపారు.

పేద‌రికం, న్యాయ సాయం గురించి చాలా ఏండ్లుగా జాతీయ, అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై ప‌లుమార్లు మాట్లాడినా ఇప్ప‌టికీ ఫ‌లితం లేకుండా పోయింద‌ని జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికీ ఈ రెండు అంశాల‌ను గురించి మాట్లాడాల్సి రావ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ఆయన వ్యాఖ్యానించారు. అభివృద్ధిలో నేడు దూసుకుపోతున్న ప్ర‌పంచంలో ఈ రెండు అంశాలు ఎప్పుడో మ‌రుగున పడాల్సినవి తెలిపారు.

సుప్రీంకోర్టు మెట్లెక్కిన తెలుగు అకాడమీ అంశం

దూకుడు పెంచిన ప్రియమణి

తెలంగాణ శాసనమండలిలో కరోనా కలకలం

బుల్లితెరపై అదరగొట్టబోతున్న విజయ్ సేతుపతి

స‌మ్మ‌ర్ స్పెష‌ల్.. ప‌చ్చిమామిడి కాయ జ్యూస్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -