Thursday, May 2, 2024
- Advertisement -

క‌ర్నాట‌క ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాలు విడుద‌ల‌….

- Advertisement -

ప్రస్తుతం దేశ ప్రజల దృష్టంతా కర్ణాటక ఎన్నికలపైనే ఉంది. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌పై ఈ ఫ‌లితాలు ప్ర‌భావం చూప‌నున్నాయి. కాంగ్రెస్‌, భాజాపాలు పోటీ పోటీగా ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించాయి. జేడీఎస్‌ ఈ ఎన్నికల్లో కింగ్‌ మేకర్‌ అవుతుందని ఎన్నికల ముందు పలు సర్వేలు చెప్పిన విషయం తెలిసిందే.

రాష్ట్ర అసెంబ్లీలో పాలకపక్ష కాంగ్రెస్‌ పార్టీయే అత్యధిక సీట్లను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, ఆ తర్వాత స్థానాన్ని భారతీయ జనతా పార్టీ, తతీయ స్థానాన్ని జనతాదళ్‌ సెక్యులర్‌ పార్టీ దక్కించుకుంటుందని సర్వేలో వెల్లడైంది. ఈ పోలింగ్‌కు సంబంధించి ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలను పలు సంస్థలు విడుదల చేస్తున్నాయి. ఈ ఎన్నికలు మొత్తం 222 స్థానాలకు జరిగాయి.

ఇండియా టుడే-ఆక్సిస్ మై ఇండియా:

కాంగ్రెస్: 106-118
బీజేపీ: 79-92
జేడీఎస్‌: 22-30
ఇతరులు: 1-4

టైమ్స్‌ నౌ-వీఎంఆర్‌:
కాంగ్రెస్: 90-103
బీజేపీ: 80-93
జేడీఎస్‌: 31-39
ఇతరులు: 2-4

రిపబ్లిక్‌ టీవీ- జన్‌ కీ బాత్‌:
కాంగ్రెస్: 73-82
బీజేపీ: 95-114
జేడీఎస్‌: 32-43
ఇతరులు: 2-3

ప్రజాన్యూస్‌:
కాంగ్రెస్: 72-78
బీజేపీ: 102-110
జేడీఎస్‌: 35-39
ఇతరులు: 0-5

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -