Sunday, April 28, 2024
- Advertisement -

కుమార‌స్వామికి కాంగ్రెస్ బంఫ‌ర్ ఆఫ‌ర్…

- Advertisement -

కర్ణాటక రాజకీయం రసకందాయంలో పడింది. కన్నడ ఓటర్లు ఏ రాజకీయ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వకపోవడంతో ఎన్నికల ఫలితాలు హంగ్‌ దిశగా పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కన్నడ రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి. ఎవ‌రు ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తార‌నే ఉత్కంఠ నెల‌కొంది.

క‌ర్నాట‌క‌లో ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాలంటే జేడీఎస్ మ‌ద్ద‌తు త‌ప్ప‌నిస‌రి. సింగిల్ లార్జెట్స్ పార్టీగా భాజాపా అవ‌త‌రించినా ప్ర‌భుత్వ ఏర్పాటు చేయ‌డానికి కావాల్సిన ఫిగ‌ర్‌ను అందుకోలేక పోయింది. దీంతో కాంగ్రెస్ ముందు చూపుతో జేడీఎస్‌తో మంత‌నాలు ప్రారంభించింది.

కాంగ్రెస్ నేత సోనియాగాంధీ దేవ‌గౌడ‌కు ఫోన్ చేసి కుమార స్వామికి ముఖ్య‌మంత్రి అద‌వి ఇచ్చేంద‌కు సుమ‌ఖుత వ్య‌క్తం చేయ‌డంతో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఆజాద్, అశోక్ గెహ్లాట్ జెడిఎస్ నేత కుమారస్వామితో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

కాంగ్రెసు 78 సీట్ల వద్ద, జెడిఎస్ 38 సీట్ల వద్ద ఆగిపోయాయి. ఈ రెండు పార్టీలు కలిపితే మెజారిటీ సాధించడానికి వీలువుతుంది. అధికార పీఠాన్ని భాజాపాకు ద‌క్క‌కుండా కాంగ్రెస్ పావులు క‌దుపుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -