- Advertisement -
భారత ప్రధాని నరేంద్ర మోడీ తో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో చంద్రబాబు ,కేసిఆర్ లు ఎంచక్కా ఒకరినొకరు హాయిగా పలకరించుకుంటూ పాల్గొనడంతో చూసే వాళ్ళంతా ఆశ్చర్య పోయారట!ఆ కార్యక్రమంలో ఆసాంతం పక్కపక్కనే కూర్చున్నారు బాబు -కేసిఆర్ లు.
ఇక సమావేశం అయిన తర్వాత మాత్రం జరిగిన ఫోటో సెషన్ లో మాత్రం మోడీ పక్కనే కేసిఆర్ నిలబడగా బాబు మాత్రం వెనుక వరుసలో నిలబడటం ఆశ్చర్య పరిచింది. బాబు -మోడీ కి ఎన్నికల ముందు నుండి మిత్రుడి గా ఉండగా కేసిఆర్ మాత్రం మోడీ లేదు గీడి లేదు అంటూ కయ్యానికి కాలు దువ్వాడు ఇన్నాళ్ళు. ఐతే ఆరు నెలల్లో కేసిఆర్ కు తత్వం బోధపడినట్లుంది అందుకే కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వడం కంటే స్నేహ హస్తం చాచితే బెటరని భావించారు అందుకే మోడీ కి అండగా ఉండాలని ఎంపి లను అదేశించాడట కేసిఆర్ .
