Monday, April 29, 2024
- Advertisement -

కేరళ రాజకీయాలలో ఇంత పెద్ద అస్త్రం.. ఎవరు ఊహించలేదు..!

- Advertisement -

అసెంబ్లీ ఎన్నికల వేళ.. అధికార ఎల్​డీఎఫ్​ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను బిజేపి, కాంగ్రెస్​ వాడుకుంటున్నాయని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​ ఆరోపించారు. డాలర్​ స్మగ్లింగ్​ కేసులో తనతో పాటు, కొందరు రాష్ట్ర మంత్రుల ప్రమేయం ఉందంటూ కస్టమ్స్​ విభాగం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్​పై విజయన్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న స్వప్న సురేశ్​ మానసిక పరిస్థితిని కస్టమ్స్​ అధికారులు ఉపయోగించుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. హైకోర్టుకు కస్టమ్స్ విభాగం సమర్పించిన పిటిషన్​.. రాజకీయ ప్రకటనలా ఉందని ఆరోపించారు.

ఎన్నికలు సమీపిస్తున్నాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడి చేస్తున్నాయి. అవి బిజెపీ, కాంగ్రెస్​ ఎజెండాను అమలు పరుస్తున్నాయి.” అని అన్నారు. డాలర్​ స్మగ్లింగ్​ కేసులో సీఎం, మంత్రుల పేర్లను పేర్కొంటూ కస్టమ్స్ విభాగం వేసిన పిటిషన్​కు నిరసనగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కస్టమ్స్​ కార్యాలయాల ముందు లెఫ్ట్​ పార్టీలు ధర్నాలు చేశాయి.

మరోవైపు గోల్డ్ స్మగ్లింగ్​ కేసులో అధికార పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి బాలక్రిష్ణన్​ భార్య వినోదినికి కస్టమ్స్ విభాగం నోటీసులు జారీ చేసింది. వారంలోపు విచారణకు హాజరు కావాల్సిందిగా అందులో పేర్కొంది.

ఒకటేమో గాల్లోనే చక్కర్లు.. మరొకటి ఏకంగా రద్దు..!

వైరల్ అవుతున్న శర్వానంద్, రామ్ చరణ్ ఫోటోలు….!

ముత్తూట్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ జార్జ్‌ ముత్తూట్‌ కన్నుమూత..!

లాభ నస్టాలు లెక్క చెప్పిన సీఎం కేసిఆర్.. 2021-22 బడ్జెట్‌..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -