Saturday, May 4, 2024
- Advertisement -

లాభ నస్టాలు లెక్క చెప్పిన సీఎం కేసిఆర్.. 2021-22 బడ్జెట్‌..!

- Advertisement -

రాష్ట్ర 2021-22 బడ్జెట్‌ ఆశాజనకంగా ఉండబోతోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనప్రాయంగా తెలిపారు. వార్షిక పద్దు అంచనాలు, కేటాయింపుల కోసం విధి విధానాలు ఖరారయ్యాయని సీఎం తెలిపారు. బడ్జెట్‌ సమావేశాలు మార్చి నెల మధ్యలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని సీఎం వెల్లడించారు. బడ్జెట్ ప్రతిపాదిత అంచనాలపై సీఎం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా నిర్వహించారు. శాఖలవారీగా ఆర్థికపద్దు అంచనాలను, అధికారులు అందించిన ఆర్థిక నివేదికలను పరిశీలించారు.

కరోనా ప్రభావం వల్ల రాష్ట్ర ఖజానాకు దాదాపు 50 వేల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని… ఆ ప్రభావం లక్ష కోట్లకు చేరుకున్నదని ముఖ్యమంత్రి తెలిపారు. కరోనా అనంతరం రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుని రాబడి పెరిగిందని…ఈ నేపథ్యంలో గత బడ్జెట్ కంటే ఈసారి కేటాయింపులు ఎక్కువగానే ఉండే ఆస్కారముందని సీఎం పేర్కొన్నారు. ఆదివారం నుంచి శాఖలవారీగా అధికారులతో సమన్వయం చేసుకుంటూ… ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్‌రావు సమావేశాలు నిర్వహిస్తారని సీఎం తెలిపారు.

ఇంగ్లాండ్ ని మట్టికరిపించిన టీమ్‌ఇండియా.!

అక్కడే దిక్కు లేదు.. ఇక్కడ కడతారు అంట: కేటీఆర్

అక్కడే దిక్కు లేదు.. ఇక్కడ కడతారు అంట: కేటీఆర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -