Saturday, May 4, 2024
- Advertisement -

కొత్త 500, 1000 నోట్ల విశేషాలు ఇవే!

- Advertisement -
Know More Details About New Indian Currency Notes

మోడీ సంచలన నిర్ణయం దేశానికి మేలు చేసేదే అయినా దానిపై కూడా కొన్ని రూమార్స్ ప్రచారం అవుతున్నాయి. రద్దు చేయడం ఎందుకు? మళ్లీ కొత్త నోట్లు ప్రవేశ పెట్టడం ఎందుకు? రకరకాల అనుమానాలు దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి. గతంలో ఎన్ని ఐదు వందల నోట్లు, వెయ్యి నోట్లు ఉన్నాయో తిరిగి అన్నీ ముద్రించడం లేదు.

వాటిలో పది శాతం కూడా మించబోవని సమాచారం. కాబట్టి బ్లాక్ మనీ ఉన్నోళ్లు మళ్లీ మార్చుకుని దాచుకుంటారని భ్రమలేమీ వద్దు. కొత్త నోట్లు చాలా పరిమితంగా మాత్రమే ఇస్తారు. మీరు అడిగినన్ని ఇవ్వరు. ఈ పరిమితి సరిగ్గా మీ పెద్ద నోట్లు డిపాజిట్ చేసే రోజే ముగుస్తుంది. కాబట్టి బ్లాక్ ను కొత్త నోట్లు ప్రోత్సహించే అవకాశమే లేదు. ఇక కొత్త నోట్ల విషయానికి వస్తే… ఆర్బీ ఇప్పటికే వీటిని అన్ని బ్యాంకులకు పంపింది. కొత్త ఐదొందల నోట్లు స్టోన్ గ్రే కలర్లో ఉంటాయి.

66 mm ఎత్తు, 150 mm పొడవు ఉంటాయి. నెంబరు ప్యానెల్లో ఇంగ్లిష్ లెటర్ ‘ఇ’ ఉంటుంది. ప్రతి నోటుపై స్వచ్ భారత్ లోగో ఉంటుంది. అంధులు గుర్తుపట్టే బ్రెయిలీ గుర్తులు కూడా ఉంటాయి. ఇక రెండు వేల నోటు నెంబరు ప్యానెల్లో ఇంగ్లిష్ అక్షరం ‘ఆర్’ ఉంటుంది. ఈ నోటుపై కూడా స్వచ్ఛ భారత్ లోగో ఉంటుంది. ఈ నోటుపై గ్రీన్ త్రెడ్ ఉంటుంది. నోటును వంచి చూస్తే అది నీలం రంగులో కనిపిస్తుంది. ఈ కొత్త నోట్లు విలువ వేరయినా ఎత్తు పొడువు మాత్రం ఒకటే ఉంటాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇప్పటికే అన్ని బ్యాంకుల కరెన్సీ చెస్ట్ లకు ఈ కొత్త నోట్లు చేరాయి.  రేపటి నుంచి మీరు కొత్త నోట్లను తీసుకోవచ్చు.

Related

  1. మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు..!
  2. షూటింగ్ లకు షాక్ ఇచ్చిన మోడీ!
  3. ప్రజలు ఏం చెయ్యాలని మోదీ కోరుకుంటున్నారు?
  4. నేటి అర్థరాత్రి నుంచి రూ.500, 1000 నోట్లు రద్దు: ప్రధాని 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -