Tuesday, May 14, 2024
- Advertisement -

అమెరికాలో కెటిఆర్ సుడిగాలి పర్యటన

- Advertisement -

అమెరికాలో పర్యటిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు అక్కడ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. తెలంగాణలో మెడికల్ పార్క్ లో పెట్టుబడులు పెట్టాలంటూ అమెరికన్ కంపెనీలను కోరారు. వైద్య పరికాల తయారీలో ప్రపంచంలోనే నెంబర్ వన్ సంస్ధ మెడ్ ట్రోనిక్ సంస్ధ ప్రతినిధులను కలిసిన కెటిఆర్ తమ కంపెనీని తెలంగాణలో కూడా ప్రారంభించాలని కోరారు.

హైదరాబాద్ లో అపారమైన మానవ వనరులు, మౌలిక వసతులు ఉన్నాయని, దీంతో వైద్య రంగంలో ఆవిష్కరణలో నగరం కేంద్రంగా మారుతోందని కెటిఆర్ తెలిపారు. ప్రభుత్వ వైద్యం విధానంపై ఇక్కడి ప్రజల్లో ఎంతో నమ్మకం ఉందని, ఇక్కడ ఆవిష్కరణల్లో అమెరిన్ కంపెనీలు కూడా భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. అమెరికా పర్యటన సందర్భంగా కెటిఆర్ బోస్టన్ లో పర్యటించారు.

ఈ సందర్భంగా అక్కడ బోస్టన్ సైంటిఫిక్ గ్రూప్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు అనువైన అంశాలను వారికి వివరించారు. మంత్రి ఆహ్వానం మేరకు తెలంగాణలో పెట్టుబడులు పెట్టే అంశంపై నిర్ణయం తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -