Sunday, April 28, 2024
- Advertisement -

KTR:ఆంధ్రాలో ఐటీ కంపెనీలు..జగన్నతో మాట్లాడుతా

- Advertisement -

తెలంగాణ మంత్రి కేటీఆర్ , ఏపీ సీఎం జగన్ ఇద్దరూ స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో మంత్రి కేటీఆర్ ఇదే విషయాన్ని సైతం వెల్లడించారు. ఇక తాజాగా వరంగల్‌లో మాట్లాడిన కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలోనూ ఐటీ సంస్థలు పెట్టాలని క్వాడ్రంట్ సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రతినిధులకు సూచించారు.

అవరసమైతే జగనన్నకు చెప్పి జాగా ఇప్పిస్తానని చెప్పుకొచ్చారు. ఆంధ్రాలోని భీమవరం, నెల్లూరు ప్రాంతాల్లో భవిష్యత్‌లో ఉజ్వలమైన ఉపాధి అవకాశాలు వస్తాయని … అక్కడి పిల్లలకు టాలెంట్ ఏం తక్కువ లేదన్నారు. బెంగళూరులో ఉన్న 40 శాతం మంది ఐటీ ఉద్యోగులు.. ఆంధ్రా, తెలంగాణ వాళ్లేనని వారంత సొంత ప్రాంతాలకు వచ్చేందుకు రెడీగా ఉన్నారని చెప్పారు.

దేశానికి మంచి జరగాలంటే ఎక్కడివారికి అక్కడ ఉపాధి అవకాశాలు రావాలని…అందుకే ఏపీలోనూ ఐటీ సంస్థలు పెట్టాలని కోరారు మంత్రి కేటీఆర్. దీంతో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక ఇటీవల చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా ఐటీ ఉద్యోగులు హైదరాబాద్‌లో ఆందోళనలకు దిగగా వారికి అనుమతి ఇవ్వలేదు తెలంగాణ ప్రభుత్వం. దీంతో లోకేష్ తనకు ఫోన్ చేశారని…అయితే ఐటీ ఇండస్ట్రీ బాగుకోసం అనుమతి ఇవ్వడం కుదరదని చెప్పిన సంగతి తెలిసిందే. లోకేష్ కూడా తనకు మిత్రుడే కానీ ఐటీ కారిడార్ దెబ్బతినే పరిస్థితి రావొద్దనే అనుమతి ఇవ్వలేదని చెప్పుకొచ్చారు కేటీఆర్. తాజాగా ఏపీలో ఐటీ కంపెనీల ప్రస్తావన తీసుకొచ్చిన కేటీఆర్ మాటలు ట్రెండింగ్‌గా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -