Saturday, April 20, 2024
- Advertisement -

తెలంగాణలో మరోసారి చిరుత కలకలం!

- Advertisement -

గత కొద్ది రోజులుగా తెలంగాణలో వరుసగా పులి, చిరుత పులులు టెన్షన్ పెడుతూనే ఉన్నాయి. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం జాంగం గ్రామ అటవీ ప్రాంతంలో చిరుత పులి లేగ దూడ పై దాడి చేయడంతో దూడ అక్కడికక్కడే మృతి చెందింది. ఇక కొమురం భీమ్ జిల్లా అటవీ ప్రాంతంలో పులి ని పట్టుకోవడానికి ఎన్ని తంటాలు పడుతున్నారో అందరికీ తెలిసిందే.

లాక్ డౌన్ సమయంలో అడవుల్లో సంచరించాల్సిన కృర మృగాలు జనావాసాల్లోకి రావడం చూశాం. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో చిరుత కలకలం సృష్టించింది. ఆదివారం అర్ధరాత్రి రన్ వేపై 10 నిమిషాల పాటు చిరుత పులి సంచరించినట్లు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది.

ఆ తర్వాత చిరుత.. రషీద్‌గూడ వైపు గోడ దూకి పరుగులు తీసింది. రషీద్‌గూడ గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారం గమనించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -