Friday, April 19, 2024
- Advertisement -

కరోనాతో ఆడ సింహం మృతి

- Advertisement -

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత ఏడాది కన్నా ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తుంది. గత నెలలో రోజుకు నాలుగు లక్షల కేసులు నమోదు అయ్యాయి అంటే ఎంత ఘోరమో అర్థం అవుతుంది. మొన్నటి వరకు మనుషులకే అనుకుంటే తాజాగా ఇప్పుడు జంతువులను కూడా కరోనా వదలడం లేదు. తాజాగా కరోనాతో ఓ సింహం మృతి చెందింది. ఈ ఘటన తమిళనాడులోని వండలూర్ అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్ లో చోటు చేసుకుంది.

“నీలా” అనే తొమ్మిది సంవత్సరాల ఆడ సింహం కరోనాతో మృతి చెందింది. మొదటగా అక్కడ ఉండే 5 సింహాలకు ఆకలి లేకపోవడం, దగ్గు లాంటి లక్షణాలు కనిపించాయన అధికారులు తెలిపారు. తర్వాత జూలోని వెటర్నరీ డాక్టర్లు టెస్టులు చేశారు. శాంపిల్స్ మధ్యప్రదేశ్ భోపాల్ లోని లాబ్ కి పంపాడు. మొత్తం 11 సింహాల్లో 9 సింహాలకు పాజిటివ్ గా తేలింది. లాక్ డౌన్ కారణంగా గత నెల రోజులుగా జూలాజికల్ పార్క్ మూసి ఉన్నప్పటికీ వాటికి కరోనా సోకింది.

అంతే కాదు జూ సిబ్బంది మొత్తం వ్యాక్సినేషన్ చేయించుకున్నావారే గాక, ఎవరికి కరోనా సోకక పోవడం గమనార్హం. హైదరాబాద్ లోని సెల్యూలార్ అండ్ మాలిక్యూలార్ బయాలజీ సెంటర్ కు, బరేలీలోని ఇండియన్ వెవెటర్నర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు పంపినట్లు సమాచారం. అయితే ఎలా సింహాలకు కరోనా సోకిందనే దానిపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -