Sunday, May 12, 2024
- Advertisement -

ఇక స్కూల్ల‌లో ఎస్ , నోకు బ‌దులు జైహింద్ అని విద్యార్థ‌లు ప‌ల‌కాల్సిందే….

- Advertisement -

మ‌ధ్య ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం వివాదాస్ప‌దంగా మారింది. ఇప్ప‌టి నుంచి స్కూల్లో ప్ర‌జెంట్ ప‌లికే స‌మ‌యంలో ఎష్ , నో కు బ‌దులు జైహింద్ అనాల‌ని రాష్ట్ర విద్యాశాఖ ఉత్త‌ర్వ‌లు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఈ విధానాన్ని అమలు చేశారు. ప్రైవేటు స్కూళ్లలో ఇష్టం ఉంటే అనొచ్చు లేదంటే లేదని విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు సూచిస్తూ స్కూళ్లకు లేఖలు పంపించామని పేర్కొంది.

మధ్య ప్రదేశ్‌లో మొత్తం 1.22 లక్షల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇకపై వారంతా హాజరు పలికే సమయంలో ‘జై హింద్‌’ అని చెప్పాల్సిందే. ఇలా చేస్తే పిల్లల్లో దేశభక్తి పెరుగుతుందని ఆ రాష్ట్ర సర్కారు భావిస్తోంది. ఈ ఉత్త‌ర్వులు విప‌క్షాలు వ్య‌తిరేకిస్తున్నాయి. ముందు స్కూల్ల‌లో మౌలిక స‌దుపాయాలు కల్పించ‌డంతోపాటు పాఠాలు చెప్పేందుకు త‌గినంత మంది టీచ‌ర్ల‌ను నియ‌మించాల‌ని ప్ర‌తిప‌క్షాలు సూచించాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -