Saturday, May 4, 2024
- Advertisement -

పాడెపై నుంచి లేచిన బామ్మ.. షాక్ తిన్న కుటుంబ సభ్యులు!

- Advertisement -

గత ఏడాది నుంచి దేశ వ్యాప్తంగా కరోనా సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. ఇక సెకండ్ వేవ్ వచ్చినప్పటి నుంచి కరోనా కేసులు మరిన్ని పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో చాలా మంది కరోనా రోగుల పట్ల నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో కరోనావైరస్ కల్లోలం రేపుతున్న నేపథ్యంలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కరోనాతో మృతి చెందిందని వృద్ధురాలికి త్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా ఆ వృద్ధురాలు పాడెపై నుంచి ఏడుస్తూ కళ్లు తెరిచింది. అంతే అక్కడ ఉన్నవాళ్లు ఒక్కసారే షాక్ కి గురయ్యారు. బామ్మ బతికిందని కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు.

ప్రస్తుతం బామ్మ ఆస్పత్రిలో ఉంది. ఈ సంఘటన మహారాష్ట్రలో బారామతిలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ముధాలేలోని బారామతి గ్రామానికి చెందిన శకుంతల గైక్వాడ్‌ (76)కు మే 10వ తేదీన కరోనా సోకిందని తేలింది. దీంతో ఇంట్లో హోం ఐసొలేష‌న్‌లో ఉంచారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పలు ఆస్పత్రులకు తీసుకెళ్లిన పడకలు లేకపోవడంతో ఎవరు అడ్మిట్ చేసుకోలేదు.

బామ్మ పరిస్థితి పూర్తిగా విషమించి అచేతనంగా పడిపోవడంతో చనిపోయిందని కుటుంబ సభ్యులు భావించి అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా పాడెపై నుంచి కళ్లు తెరిచి చూసింది బామ్మ. ఒక్కసారిగా కుటుంబసభ్యులు అవాక్కయ్యారు. వెంటనే ఆమెను బారామతిలోని సిల్వర్‌ జూబ్లీ ఆస్పత్రిలో చేర్పించారు.కాగా, ఆ వృద్ధురాలు చికిత్స‌కు స్పందిస్తున్నార‌ని వైద్యులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -