Friday, April 26, 2024
- Advertisement -

మెడికల్ సీటు కావాలా..ఈ భారీ కుంభకోణం చూడండి..!

- Advertisement -

మధ్యప్రదేశ్​లో వైద్యవిద్య సీట్ల కుంభకోణం కేసులో ఇద్దరిని ఇందోర్​ ప్రత్యేక కార్య దళం(ఎస్​టీఎఫ్​) అరెస్టు చేసింది. కోరుకున్న కళాశాలలో ఎంబీబీఎస్​ సీట్లు ఇప్పిస్తామంటూ.. నీట్​ పరీక్ష రాసిన విద్యార్థుల వద్ద నుంచి రూ.5 కోట్లను నిందితులు కాజేశారు. ముంబయికి చెందిన ఈ నిందితులు.. మధ్యప్రదేశ్​, రాజస్థాన్​లోని ఎంతోమంది విద్యార్థులను మోసం చేసినట్లు ఎస్​టీఎఫ్​ దర్యాప్తులో తేలింది.

నిందితుల వద్ద నుంచి ఓ ల్యాప్​టాప్​, ఇతర కీలక పత్రాలను ఎస్​టీఎఫ్ పోలీసులు​ స్వాధీనం చేసుకున్నారు. 2000కు పైగా విద్యార్థుల వివరాలు వారి వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఈ వివరాల ఆధారంగా వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులను నిందితులను మోసగించేవారని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -