- Advertisement -
మెట్రో రైలు ఆలైన్‌మెంట్ మార్చాలన్న తన పంతాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ఎట్టకేలకు నెగ్గించుకున్నారు. మూడుచోట్ల మెట్రో రైలు మార్గాన్ని మార్చడానికి నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి అంగీకరించింది.
అయితే ఆలైన్‌మెంట్‌కు అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. సచివాలయంలో శనివారం మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి చైర్మన్ నాయక్, హైదరాబాద్ మెట్రోరైలు ఎల్ అండ్ టి మేనేజింగ్ డైరైక్టర్ విబి గాడ్గిల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో ముఖ్యమంత్రి కెసిఆర్ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
