Tuesday, May 14, 2024
- Advertisement -

దేనికి సంకేతం… విశ్లేష‌కులు ఏమంటున్నారు….

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఎప్పుడూ జ‌ర‌గ‌నంత‌గా భారీ పోలింగ్ న‌మోద‌య్యింది. ఓటు వేసె ప్రక్రియ పూర్త‌య్యే స‌రికి దాదాపు రికార్డు స్థాయిలో 82 శాతం వ‌ర‌కు పోలింగ్ న‌మోద‌య్యే అవ‌కాశాలున్నాయి. పెరిగిన పోలింగ్ వ‌ల్ల అధికార‌పార్టీకి షాక్ త‌ప్ప‌ద‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

అయితే ఇరు పార్టీల నేత‌లు గెలుపు మాదే నంటూ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. చివ‌రికి స్వ‌ల్ప ఉద్రిక్త‌త‌ల మ‌ద్య పోలింగ్ ముగిసింది. చివ‌రి నిమిషం దాకా ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ పెట్ట‌డానికి టీడీపీ తీవ్రంగా ప్ర‌య‌త్నించింద‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇంత భారీగా పోలింగ్ జ‌రిగితే అది అధికార ప‌క్షానికి అధిక చేటు చేస్తుంద‌ని రాజ‌కీయ మేధావులు విశ్లేషిస్తున్నారు… చంద్ర‌బాబు స‌ర్కార్‌పై ఉన్నప్ర‌జా వ్య‌తిరేక‌త ఇలా ఓటెత్తింద‌ని సీనియ‌ర్ నేత‌లు అంచ‌నాలు వేస్తున్నారు.

ఎప్పుడైనా ఉప ఎన్నిక‌లో భారీ పోలింగ్ న‌మోద‌యిందంటే అధికార ప‌క్షం గుండెల్లో రైళ్లు ప‌రిగెత్త‌డ‌మే అని వాళ్లు చెబుతున్నారు…. అంతేకాకుండా వైసీపీకి కంచుకోట‌లా ఉన్న గోస్పాడు మండ‌లంలో 83 శాతం పైగా పోలింగ్ న‌మోద‌యిందంటే టీడీపీకి వ్య‌తిరేకంగా జ‌నం పెద్దఎత్తున ఓట్లు వేశార‌ని పొలిటిక‌ల్ పండిట్స్ లెక్క‌లు క‌డుతున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోనే వైసీపీకి అత్య‌ధికంగా అభిమానులు ఉండ‌డం ఇప్పుడు ఆ పార్టీకి క‌లిసివ‌చ్చే అంశం. 2009 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నంద్యాలలో దాదాపు 70 శాతం పోలింగ్ న‌మోద‌యింది…అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆ సీటును మ‌రోసారి గెల్చింది… 2014లో 62 శాతం పోలింగ్ నమోద‌యింది. అప్పుడు వైఎస్సార్సీ గెలిచింది. ఇప్పుడు 80 శాతం పైగా పోలింగ్ జ‌ర‌గ‌డంతో అధికార ప‌క్షానికి జ‌నం వ్య‌తిరేకంగా ఓటు వేశార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. మ‌రి నంద్యాల ఓట‌ర్లు చ‌రిత్న‌ను తిరిగి రాస్తారా అనేది 28 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -