Monday, May 6, 2024
- Advertisement -

బీద అరుపుల బాబు…. దేశంలోనే అత్యంత ధనిక సిఎంగా రికార్డ్

- Advertisement -

ఈ సోషల్ మీడియా యుగంలో నిజాలు దాచటం సాధ్యమా? ప్రతిపక్ష నేత దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి…..మాకు మాత్రం చేతికి వాచీ లేదు, జేబులో డబ్బులు లేవు అని బీద అరుపులు అరిస్తే ప్రజలు అడ్డంగా నమ్మేస్తారని అనుకుంటే ఎలా? ఎప్పటికీ నిజాలు ఎవ్వరికీ తెలియవు అన్న భ్రమల్లో ఉంటే ఎలా? చంద్రబాబు ఆ భ్రమలే ఇప్పుడు బద్ధలైపోయాయి. బాబు చెప్తున్నట్టుగానే రాష్ట్రం మాత్రం నాలుగేళ్ళ బాబు పాలన తర్వాత కూడా అభివృద్ధి విషయంలో అథోగతిలోనే ఉంది. అవినీతి, అమ్మాయిలపైన దాడులు, దళితులపై దమనకాండల విషయంలో మాత్రం నంబర్ ఒన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ని నిలిపాడు చంద్రబాబు.

ఇప్పుడిక మరో విషయంలో కూడా నంబర్ ఒన్ స్థానం సంపాదించాడు చంద్రబాబు. అవినీతిలో దేశంలోనే నంబర్ ఒన్ రాష్ట్రంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ నుంచే దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి కూడా వచ్చాడు. ఆయనే మిస్టర్ చంద్రబాబునాయుడు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకంటే మన బాబుగారే అత్యంత ధనికుడు. విభజన నాడు అన్నీ నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అత్యంత ధనికుడిగా చంద్రబాబు నిలిస్తే లాభపడిన తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్ ఏ స్థానంలో ఉండి ఉంటాడు అనుకుంటున్నారా? ఆయన మాత్రం చివరి వరుసలో ఉన్నాడు. అత్యంత ధనిక రాష్ట్రాలయిన మహారాష్ట్ర, గుజరాత్……పెద్ద రాష్ట్రాలయిన ఉత్తరప్రదేశ్, బీహార్ ముఖ్యమంత్రులకంటే చిన్న రాష్ట్రం, భారీ లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు మాత్రం ధనవంతుడైన ముఖ్యమంత్రిగా నంబర్ ఒన్ స్థానాన్ని కొట్టేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి పరాకాష్టకు చేరిందని కేంద్ర ప్రభుత్వం సంస్థలు, బిజెపి, కమ్యూనిస్టులతో సహా ప్రతిపక్ష వైకాపా కూడా ఎప్పటి నుంచో చేస్తున్న ఆరోపణలకు ఆ రకంగా బలం చేకూర్చాడు చంద్రబాబు. అసోసిసేయేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ తాజాగా చంద్రబాబుగారు దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా ఎలా నిలిచారో లెక్కలతో సహా వివరించింది.

షరా మామూలుగానే ఈ వార్త సీమాంధ్ర ప్రజలకు చేరకుండా ఉండేందుకు బాబు అండ్ కో విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయినా అనవసరంగా తాపత్రయపడుతున్నారుగానీ…….‘నాలుగేళ్ళలో లక్ష కోట్లకు పైగా అప్పులు తెచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అథోగతి పాలు చేస్తేనేం…….అలాంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ బాబుగారు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా నిలబడడం ఎంత గొప్ప……..అది మాత్రం అభివృద్ధి కాదా…..?’ అని దబాయించడానికి, జనాలను నమ్మించడం బాబు భజన మీడియాకు చిటికె వేసినంత సింపుల్ పని కాదా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -