Friday, May 3, 2024
- Advertisement -

అధ్య‌క్షుడి  ఆదేశ‌కోసం ఎదురుచూస్తున్న ఆర్మీ…

- Advertisement -

అగ్రరాజ్యం అమెరికా సహా పొరుగుదేశాల హెచ్చరికలను ఖాతరు చేయకుండా కయ్యానికి కాలుదువ్వుతున్న ఉత్తరకొరియా మరోసారి రెచ్చిపోయింది. అమెరికా సమీపంలో అణుదాడి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు హెచ్చరికలు చేసింది.దీంతో అంత‌ర్జాతీయంగా యుద్ద‌వాతావ‌ర‌నం వేడెక్కింది.ఇన్నాల్లు మాట‌ల‌కే ప‌రిమిత‌మ‌యిన ఉత్త‌ర‌కొరియా యుద్ధానికి సిద్ద‌మైంది.

పసిఫిక్‌ మహాసముద్రంలోని అమెరికాకు చెందిన ద్వీపం గువామ్ తమకు 2,128 మైళ్ల దూరంలో ఉందని, ఆ ద్వీపాన్ని సర్వ నాశనం చేసి చూపిస్తామని కొరియా హెచ్చరించింది. ఉ.కొరియా క్షిపణి ప్రయోగాలను ఉపేక్షించేది లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలు చేసిన కొద్దిగంటలకే ఆ దేశం ఇలా బెదిరింపులకు పాల్పడటం సంచ‌ల‌నంగా మారింది.

ఈ ఐలాండ్ తీరంలో యూఎస్ కు చెందిన సబ్‌ మెరైన్ల స్క్వాడ్రన్‌, ఒక ఎయిర్‌ బేస్‌, కోస్ట్‌ గార్డు గ్రూపులున్నాయని, ఒకవేళ గువాంపై దాడిని అమెరికా అడ్డుకుంటే, తమ తరువాతి టార్గెట్ ఆ దేశ ప్రధాన భూభాగమే అవుతుందని హెచ్చరించారు.వాటన్నింటిని నాశనం చేసేందుకు పక్కావ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు ఉత్తరకొరియా చెప్పింది. తమ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్ ప్లాన్‌ ఆమోదించిన మరుక్షణమే.. గువాంను ప్రపంచపటంలో లేకుండా చేస్తామని ఉత్తరకొరియా అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

గువామ్‌పై మధ్యంతర బాలిస్టిక్‌ క్షిపణి హ్వాసంగ్‌-12ను ప్రయోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం’ అని ఉ.కొరియా అధికారిక మీడియా కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది.ఇప్పటికే ప్రణాళికలు తుదిదశలోకి వచ్చాయని.. ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ వున్‌ నిర్ణయం తీసుకుంటే ఏ క్షణంలోనైనా అణు దాడి చేస్తామని సదరు మీడియా వెల్లడించింది. ట్రంప్ మాట‌ల‌కే ప‌రిమిత మ‌వుతాడా లేదా సైనిక చ‌ర్య తీసుకుంటార‌నేది అంత‌ర్జాతంగా ఆందోళ‌న‌కు గురిచేస్తోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -