హీరోనాని కారు యాక్సిడెంట్… స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డిన నాని..

- Advertisement -

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాచుర‌ల్ స్టార్ నానికి ఈరోజు తెల్లవారుఝామున కారు యాక్సిడెంట్ అయ్యిందట. ఉదయం 4 గంటలకు జూబ్లి హిల్స్ రోడ్ నెంబర్ 45 లో డ్రైవర్ కారు డ్రైవ్ చేస్తూ నిద్రలోకి జారుకోవడంతో ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. నాని ముఖానికి దెబ్బలు తగిలినట్టు తెలుస్తుంది. ముక్కు, పళ్ళు గాయాలైనట్టు తెలుస్తుంది. బిజీ షెడ్యూల్ వల్ల ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా కష్టపడుతున్నాడు నాని.

ప్రస్తుతం కృష్ణార్జున యుద్ధం సినిమా షూటింగ్ లో ఉన్న నానికి యాక్సిడెంట్ అనగానే అందరు షాక్ అయ్యారు. అయితే తగిలింది చిన్న దెబ్బలే అని తెలియడంతో కాస్త కుదుటపడ్డారు. గత రెండేళ్లుగా హ్యాట్రిక్ హిట్లు కొడుతూ ఫుల్ ఫాం కొనసాగిస్తున్న నాని ఈ ఇయర్ కూడా మరో 3 సినిమాలను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.

ప్రస్తుతం నాని 365 డేస్ సినిమాలతో గడిపేస్తున్నాడు. ఒక్క రోజు కూడా గ్యాప్ తీసుకోకుండా సినిమాల్లో నటిస్తున్నాడు. గత ఏడాది మూడు హిట్ లు ఇచ్చిన నాని, ఈ ఏడాది కూడా మరో మూడు సినిమాలు లైన్లో పెట్టాడు. అంతే కాకుండా సొంత నిర్మాణ సంస్థ కూడా మొదలు పెట్టి అ అనే సినిమా చేసాడు. వచ్చే నెలలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -