Sunday, May 5, 2024
- Advertisement -

వెల్లండిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర

- Advertisement -

మరో రెండెళ్లలో హైదరాబాద్ నగరంలో రెండు లక్షల మందికి పైపులైను ద్వారా గ్యాస్ ను అందిస్తామని కేంద్రం పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెల్లడించారు. దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ జరుగుతోందని, ఇది త్వరలో పూర్తి అయి రెండేళ్లలో అమలులోకి వస్తుందని ఆయన అన్నారు.

ఇంతకు ముందు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ద్వారా గడచిన 13 ఏళ‌్లలో కేవలం 1140 కనెక్షన్లకు మాత్రమే గ్యాస్ ను పైప్ ద్వారా అందించామని, దీనికి కారణం పర్యవేక్షణ లోపం, ప్రోత్సాహం, వ్యూహం లేకపోవడమేనని మంత్రి అన్నారు. ఇక నుంచి ఆ సమస్యలు ఉండవని, దీనిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పారాదీప్ లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లోని రిఫైనరీని అప్ గ్రేడ్ చేసి అక్కడి నుంచి హైదరాబాద్ కు పైపు లైన్ల ద్వారా గ్యాస్ సరఫరా చేస్తామని చెప్పారు.

ఇక మల్లవరం నుంచి రామగుండం వరకూ డెడికేటెడ్ గ్యాస్ ను అందించేందుకు పైపు లైన్లు వేస్తున్నామని మంత్రి చెప్పారు. వికాస్ పర్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, బిజెఎల్ పి నాయకుడు కిషన్ రెడ్డి, ఇతర నాయకులతో కలిసి వికాస్ పర్వ్ ప్రతిజ్ఞ చేయించారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -