పెట్రోల్ ధ‌ర‌లు అందుకే పెరుగుతున్నయ్: కేంద్ర మంత్రి

- Advertisement -

దేశంలో గ‌తంలో ఇదివ‌ర‌కు ఎప్పుడు న‌మోదుకాని రీతిలో చ‌మురు ధ‌ర‌లు పెరిగిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల పెరుగుద‌ల సామాన్యుల న‌డ్డి విరుస్తున్నాయి. దేశంలోని ప‌లు ప్రాంతాల్లో లీట‌రు పెట్రోల్ ధ‌ర రూ. 100కు చేరింది. ప్రీమియం పెట్రోల్ ధ‌ర అయితే ఏకంగా రూ.150 దాటింది. దీనికి తోడు వంట గ్యాస్ సిలిండర్ ధ‌ర‌లు సైతం ఈ ఒక్క నెల‌లోనే రూ.100 పెరిగాయి.

దీంతో సామాన్య ప్ర‌జ‌లు, ప్ర‌తిప‌క్షాలు ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ నేప‌త్యంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్ర‌ధాన్.. ఇంధ‌న ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై స్పందించారు. పెట్రోల్ స‌హా ఇత‌ర ఇంధ‌నాల ధ‌ర‌లు ఎప్పుడు త‌గ్గుతాయ‌నేది స్ప‌ష్టంగా చెప్పలేమ‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయితే, వ‌చ్చే నెల‌లో (మార్చి-ఏప్రిల్‌) లో చ‌మురు ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశాలు ఉన్నాయ‌ని కేంద్ర మంత్రి వెల్ల‌డించారు.

- Advertisement -

ప్ర‌ధానంగా మ‌న దేశంలో చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌డానికి అంత‌ర్జాతీయంగా నెల‌కొన్న ప‌రిస్థితులే కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. ముఖ్యంగా ముడి చ‌మురు ఉత్ప‌త్తి చేసే దేశాలు కావాల‌నే ఇంధ‌న ఉత్ప‌త్తిని త‌గ్గించాయి. దీని వ‌ల్ల డిమాండ్ అధికం కావ‌డం.. ఉత్ప‌త్తి త‌క్కువ‌గా ఉండ‌టంతో చ‌మురు ధ‌ర‌లు పెరుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ముడి చ‌మురు ఉత్ప‌త్తిని పెంచాల‌ని కువైట్‌, ఖ‌తార్‌, ర‌ష్యాల‌తో పాటు చ‌మురు ఉత్ప‌త్తి దేశాల‌ను భార‌త్ కోరింద‌ని కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ వివ‌రించారు.

బాక్సింగ్ రింగులోకి రాశిఖన్నా! అందుకేనా..

‘పైన పటారం.. లోన లోటారం’ అంటున్న అన‌సూయ

పవన్ కల్యాణ్ ఒక స్టేట్ రౌడీ: వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

కాలి న‌డ‌క‌న తిరుమ‌ల కొండెక్కిన ఉప్పెన‌ హీరో, హీరోయిన్లు

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -