- Advertisement -
తాను రాజ్యసభ కోసం ప్రయత్నిస్తున్నానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, రాజ్యసభకు వెళ‌్లాలని తాను కోరుకోడం లేదని హోం మంత్రి నాయిని నర్శింహారెడ్డి చెప్పారు.
తనను ఎమ్మెల్యేగా పోటీ చేయమని 2014లోనే కెసిఆర్ అడిగారని, అయితే సాధ్యం కాదని చెప్పానని, అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీగా ఇస్తానని ఆయనే చెప్పారని, అలాగే చేశారని నాయిని వివరించారు.
కేవలం ఎమ్మెల్సీగానే కాదు.. హోంమంత్రిని కూడా చేశారు. నన్ను ఏం చేయాలో.. నాకు ఏం ఇవ్వాలో కెసిఆర్ కు తెలుసు అని నాయిని వ్యాఖ్యానించారు.
