Saturday, May 4, 2024
- Advertisement -

అధికారికంగా బైడెన్ ఎన్నిక.. తగ్గని హవా..!

- Advertisement -

అమెరికాలో ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో బైడెన్ హవా కొనసాగింది. కాలిఫోర్నియాలో ఉన్న 55 ఓట్లు బైడెన్​కు దక్కాయి. దీంతో అధ్యక్ష పదవికి కావాల్సిన 270 మార్కును అందుకున్నారు బైడెన్. ఫలితంగా అధికారికంగా అగ్రరాజ్య పదవికి బైడెన్ ఎంపికయ్యారు.

పెన్సిల్వేనియాలో ఉన్న 20 ఓట్లన్నీ డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్​కు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఉపాధ్యక్ష పదవి కోసం సభ్యులంతా కమలా హారిస్​కు ఓటేసినట్లు చెప్పారు. మరోవైపు విస్కాన్సిన్​లో ఉన్న 10 ఎలక్టోరల్​ ఓట్లు బైడెన్​కే పడ్డాయి. ఉపాధ్యక్ష పదవికి కమలా హారిస్​ను ఎన్నుకున్నారు.

అరిజోనాలోని 11 ఎలక్టోరల్​లు సైతం జో బైడెన్, కమలా హారిస్​కు పట్టం కట్టారు. ఈ మేరకు అధికారికంగా తమ మద్దతు పత్రాలపై సంతకాలు చేశారు. నెవాడాలో 6, జార్జియాలో 13 ఎలక్టోరల్ ఓట్లు బైడెన్, కమల​కే దక్కాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -