Tuesday, May 14, 2024
- Advertisement -

సోషియ‌ల్ మీడియా అభిమానులు ఎంత‌వ‌ర‌కు వైసీపీ విజ‌యంలో తోడ్ప‌డ‌తారు..?

- Advertisement -
  • సోషియ‌ల్ మీడియాలో జ‌గ‌న్‌కు పెరుగుతున్న అభిమానులు..
  • తాజాగా వీడిపి స‌ర్వే ఫ‌లితాలే నిద‌ర్శ‌నం..?
  • నెటిజ‌న్ల మ‌ద్ద‌తు వాపు మాత్ర‌మేనా…?
  • అభిమానులు అంతా ఓట‌ర్లుగా మారుతారా..?
  • నెటిజ‌న్ల అత్యుత్సాహం జ‌గ‌న్‌కు ఇబ్బందేనా…?
  • ఒంటిమీద ష‌ర్టు న‌ల‌గ‌ద్దు….జ‌గ‌న్ సీఎంకావాలి..?
  • గ‌తంలో జ‌రిగిన త‌ప్పిదాలే పుర‌రావృతం అవుతాయా….?
  • ఒక‌లైక్‌…ఒక షేర్‌తో జ‌గ‌న్ సీఎం అవుతారా….?
  • సోషియ‌ల్ మీడియాలో విచిత్ర పోస్ట్‌లు ప్ల‌స్సా లేక మైన‌స్సా..?
  • సోషియ‌ల్‌మీడియా ద్వారా అధికారాన్ని ద‌క్కించుకుంటె… వంద‌ల‌కోట్లు ఖ‌ర్చు ఎందుకు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు సోషియ‌ల్ మీడియాలో ఆద‌ర‌న పెరుగుతోంద‌న‌డంలో వాస్త‌వం లేదు.ఎక్క‌డ జ‌గ‌న్‌కు ఏంజ‌రిగినా క్ష‌ణాల్లో ఆయ‌న నెటిజ‌న్ల అభిమానులు స్పందిస్తారు. జ‌గ‌న్‌మీద ఈగ వాలినా ఊరుకోరు. 2019లో అధికారంలోకి రావాల‌ని జ‌గ‌న్ దూకుడు పెంచుతున్నారు. 2014 ఎన్నిక‌ల‌లో భాజాపా అధికారంలోకి రావ‌డానికి ముఖ్యంగా సోషియ‌ల్‌మీడియా ప్ర‌ముఖ‌పాత్ర పోషించింది. ఇప్పుడు అంద‌రూ అదే పాలో అవుతున్నారు. ఇప్పుడు జ‌గ‌న్‌కుకూడా నెటిజ‌న్ల మ‌ద్ద‌తు ఉంద‌న‌డంలో సందేహంలేదు. కాని గ‌తంలో ప్ర‌జారాజ్యంపార్టీ ఏమ‌య్యిందో అంద‌రికి తెలిసిందే. అభిమానం అంతా ఓట‌ర్లుగా మార‌లేదు.

ఇప్పుడు జ‌గ‌న్‌కూడా నెటిజ‌న్ల అభిమానులంతా ఓట్లు వేస్తార‌నేది అనుమాన‌మే. అందుకే జ‌గ‌న్ సోషియ‌ల్ మీడియాతోపాటు మ‌రింత క్షేత్ర‌స్థాయిలోకి వెల్లాలి. ఇప్ప‌టి వ‌ర‌కు 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌నే సీఎం అవుతార‌ని కొన్ని స‌ర్వేఫ‌లితాలు వ‌చ్చాయి. తాజాగా వీడిపి స‌ర్వే ఫ‌లితాలే నిద‌ర్శ‌నం. ఆఫ‌లితాల‌లో మ‌ళ్లీ బాజాపా-టీడీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని, ప‌వ‌ణ్‌కు నిరాశే….జ‌గ‌న్ మ‌రోసారి ప్ర‌తిప‌క్షానికే ప‌రిమిత మ‌వుతార‌ని ఫ‌లితాలు వ‌చ్చాయి. మ‌రి ఈఫ‌లితాల‌పై జ‌గ‌న్ దృష్టిసారించాలి.
నెటిజ‌న్లు కొంత వ‌ర‌కు ఉప‌యేగ‌ప‌డినా క్షేత్ర‌స్థాయిలో మాత్రం సామాన్య‌,పేద‌,మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లే ఓట్లే కీల‌కం. జ‌గ‌న్ వాటిమీద‌నే దృష్టిసారించాలి. వారిని అక్టుకొనే విధంగా వారి స‌మ‌స్య‌లును ద‌గ్గ‌ర‌నుండి ప‌రిస్కించేవిధంగా మ‌రింత దూకుడుగా జ‌గ‌న్ ముందుకెల్లాలి. ప్ర‌శాంత్ కిషోర్ పార్టీ ప‌రిస్థితుల‌పై నివేదిక ఇచ్చారే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ నివేదిక‌లో కూడా పార్టీ బ‌ల‌హీనంగా ఉంద‌నేదానికి 35 మంది నియేజ‌క ఇన్‌ఛార్జ్‌ల‌కు వ్య‌తిరేకంగా రిపోర్ట్ వచ్చింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.
సోషియ‌ల్ మీడియాలో ఒక లైక్‌…ఒక షేర్‌తో జ‌గ‌న్ సీఎంకాలేరు. గ‌తంలోకూడా ఇదే అత్యుత్సాహం కొంప ముంచింది. మ‌రి ఇప్పుడ‌కూడా వాస్త‌వ ప‌రిస్థితుల‌ను గ్ర‌హించి ముందుకెల్లాలి. నెటిజ‌న్ల మ‌ద్ద‌తుతోనే సీఎంకాలేరు. అది కొంత‌వ‌ర‌కు ఉప‌యేగ‌ప‌డుతుంది.
ఎన్నిక‌ల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయే చెప్ప‌లేని ప‌రిస్థితి. ప్ర‌ధానంగా స్మార్ట్ ఫోన్‌ల వాడ‌కం పెరిగిపోయింది..క్షేత్ర‌స్థాయిలో ఎంత‌మంది ఓట‌ర్లు ఇంట‌ర్నెట్ వాడుతున్నారు. ఎంత‌మంది జ‌గ‌న్‌ను ఫాలో అవుతున్నారో చూస్తె అది చాలా త‌క్కువ స్థాయిలోనే ఉంటుంది. విజ‌యంలో సాధార‌న‌, పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లే ప్ర‌ముఖ భూమిక పోషిస్తార‌నేది తెలిసిందే. క్షేత్ర స్థాయిలో ఎంత‌మంది జ‌గ‌న్‌ను పాలో అవుతున్నార‌నేది గ్ర‌హించాల్సిన విష‌యం.

గ‌తంలో చిరంజీవి ప్ర‌జా రాజ్యం పార్టీని స్థాపించి చివ‌రికి కాంగ్రెస్‌లో విలీనం చేయాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. అభిమానుల‌ను ఓట‌ర్లుగా మ‌లుచుకోవ‌డంతో విఫ‌ల‌మ‌య్యారు. జ‌గ‌న్ కూడా విస్త‌వ ప‌రిస్థితుల‌ను గ్ర‌హించి ముందుకెల్లాలి..ఒక లైక్‌….ఒక‌…షేరుతో ఎవ‌రూ సీఎం కాలేర‌న్న స‌త్యాన్ని గుర్తుంచుకోవాలి. నెటిజ‌న్ల‌నే న‌మ్ముకుంటె 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ బోక్క‌బోర్లా ప‌డం ఖాయ‌మని విశ్లేష‌కులు అభిప్రాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -