పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఎన్నో అంచనాలు మధ్య రాజకీయాల్లోకి వచ్చాడు. అవినీతి లేని సమాజాన్ని నిర్మిస్తానని చెప్పిన పవన్ కల్యాణ్ ఎన్నికల సమయానికి చెతులెత్తేశాడు. యువతరం మొత్తం తన వెంటే వస్తుందని భావించిన పవన్‌కు అతని ఫ్యాన్స్ సైతం షాకిచ్చారు. ఎన్నికల ముందే పవన్ కల్యాణ్ తెలిపోయారని ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. టీడీపీతో పవన్ కల్యాణ్ రహస్య పొత్తు పెట్టుకున్నారని అందరికి ఇట్టే అర్ధం అయింది. ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన పవన్ కల్యాణ్ , తన ప్రశ్నలనే కేవలం జగన్‌కు పరిమితం చేశారు.
65 స్థానాల్లో పోటీ చేసిన పవన్ కల్యాణ్ ఎలా సీఎం అవుతారని ప్రజలతో పాటు , అతని ఫ్యాన్స్ కూడా ప్రశ్నిస్తున్నారు. సీపీఎం, సీపీఐ, మాయవతితో కలిసి పోటీ చేసిన స్ధానాలు మొత్తం కలిపినప్పటికి 120 స్థానాలు కూడా దాటలేదు. అయినప్పటికి తమ పార్టీ 88 స్థానాల్లో గెలుస్తుందని చెప్పడం ఆ పార్టీ నేతలకే చెల్లుతోంది. ఎన్నికల జరిగిన తీరు సమీక్షకు అభ్యర్థులను పిలిస్తే కేవలం 15 మంది రావడంపై పవన్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎన్నికల సమీక్ష కోసం నిర్వహించిన మీటింగ్ కేవలం చాయ్ , బిస్కెట్లకే పరిమితం అవ్వడంతో పవన్ పార్టీ ప్రభావం ఏంటో తెలిపోయింది.
పార్టీపై అభ్యర్థులకు సైతం నమ్మకం లేకనే వారు ఈ మీటింగ్‌కు రాలేదని తెలుస్తోంది. దీనిపై ఇతర పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో జోకులు వేసుకుంటున్నారు. పోటీ చేసిందే 65 మంది, అందులో వచ్చింది 15 మంది. ఇక ఎన్నికల ఫలితాలు తరువాత జనసేనాని ఒక్కడే పార్టీలో మిగులుతాడా ఏంటని వారు పవన్ పార్టీని ట్రోల్ చేస్తున్నారు.
- Advertisement -
జనసేన అధ్యక్షుడు పిలిస్తే వచ్చింది 15 మంది అభ్యర్థులే..!
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -
